Leading News Portal in Telugu

India vs England: టీమిండియాకు బిగ్‌ షాక్.. అర్ధాంతరంగా టెస్ట్‌ మ్యాచ్‌ నుంచి తప్పుకున్న అశ్విన్‌..



Ashwin

India vs England: ఇంగ్లాండ్‌-భారత్‌ మధ్య మూడో టెస్ట్‌ జరుగుతోన్న సమయంలో టీమిండియాకు బిగ్‌షాక్‌ తగిలింది.. ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్.. రాజ్‌కోట్ టెస్ట్ నుండి వైదొలిగాడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లితో ఉండటానికి అశ్విన్ రాజ్‌కోట్ నుండి చెన్నైకి తిరిగి వెళ్లాల్సి వచ్చింది.. మూడో టెస్ట్‌లో 37 పరుగులు చేసి ఒక వికెట్ తీసుకున్న అశ్విన్.. అత్యవసర పరిస్థితి కారణంగా టెస్ట్ జట్టు నుండి వైదొలిగినట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.. “రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ జట్టు నుండి వైదొలిగాడు, కుటుంబ సభ్యుల వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా వెంటనే ఇది అమలులోకి వచ్చింది. ఈ సమయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరియు జట్టు పూర్తిగా అశ్విన్‌కు మద్దతు ఇస్తుందని పేర్కొంది.

Read Also: YSRCP Rebel MLAs: రెబల్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు.. 19న తుది విచారణ..!

“చాంపియన్ క్రికెటర్ మరియు అతని కుటుంబానికి బీసీసీఐ తన హృదయపూర్వక మద్దతును అందిస్తుంది అని పేర్కొన్నారు.. క్లిష్ట ప‌రిస్థితుల్లో ఇండియ‌న్ టీమ్‌తో పాటు బీసీసీఐకూడా అత‌డికి అండ‌గా ఉంటుంద‌ని తెలిపింది. అశ్విన్ ప్రైవ‌సీకి భంగం క‌ల‌గ‌కుండా అభిమానులు సంయ‌మ‌నం పాటించాల‌ని తెలిపింది.. ఈ క‌ఠిన సమయంలో అశ్విన్‌కు అన్ని విధాలుగా సాయం అందించేందుకు బోర్డ్ సిద్ధంగా ఉంద‌ని పేర్కొంది.. త‌న త‌ల్లికి సీరియ‌స్‌గా ఉండ‌టంతోనే అశ్విన్.. చెన్నై వెళ్లిన‌ట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే, మూడో టెస్టు రెండో రోజు.. రాజ్‌కోట్‌లో అశ్విన్ బ్యాట్ మరియు బాల్ రెండింటితో అద్భుతంగా రాణించారు.. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ కష్టాల్లో పడిన సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్‌.. ధృవ్ జురెల్‌తో కలిసి 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు, భారత్ 400 పరుగుల మార్కును దాటేలా చేశాడు.. అశ్విన్ 37 పరుగులు చేయడంతో భారత్ ఇన్నింగ్స్ 445 పరుగులకు ఆలౌటైంది.

Read Also: KCR birthday: నేడు కేసీఆర్‌ బర్త్‌ డే.. రాష్ట్రవ్యాప్తంగా పుట్టిన రోజు వేడుకలు

మరోవైపు, టీమిండియా బౌలర్‌ అశ్విన్‌.. రికార్డ్‌ సృష్టించాడు. టెస్టుల్లో 500 వికెట్లు తీసి భారత్‌ నుంచి రెండో బౌలర్‌గా ఘనత సాధించాడు. రాజ్ కోట్ టెస్ట్ లో జాక్ క్రాలే వికెట్ తీయడంతో రవిచంద్రన్ అశ్విన్ ఐదు వందల వికెట్ల క్లబ్ లో చేరాడు. 98 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ లో అశ్విన్ తొలి వికెట్ తీశాడు. టెస్ట్ కెరీర్ లో 183 ఇన్నింగ్ ఆడిన అశ్విన్ 8 సార్లు పది వికెట్లు పడగొడ్డాడు. 34 సార్లు 5 వికెట్లు తీశాడు. 500 వికెట్ల క్లబ్ లో చేరిన 9వ బౌలర్‌ నిలిచాడు. కంబ్లే తరువాత ఈ ఘనత అందుకున్న రెండో భారతీయుడిగా నిలిచాడు. 2011లో తొలి టెస్ట్ ఆడిన ఈ బౌలర్.. అనేక రికార్డులు సృష్టించాడు. ఇప్పుడు 500వికెట్ల క్లబ్‌లో చేరి మరో ఘనత అందుకున్నాడు.