Leading News Portal in Telugu

Kiara Advani: తల్లి కాబోతున్న కియారా అద్వానీ..పిక్స్ వైరల్…



Kiaraa

బాలివుడ్ బ్యూటీ కియారా అద్వాని అటు హిందీ, ఇటు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది.. ఇటీవల తాను ప్రేమించిన సిద్ధార్థ్ మల్హోత్రా ను పెళ్లి చేసుకుంది.. పెళ్లి తర్వాత ఈ బ్యూటీ అస్సలు ఖాళీ లేదని చెప్పాలి.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా గడుపుతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులను పలకరిస్తూ వస్తుంది.. తన పర్సనల్ విషయాలు లేటెస్ట్ ఫొటోలతో పాటు సినిమా విషయాలను షేర్ చేస్తుంది.. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు తల్లి కాబోతుందన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి..

ఈ అమ్మడు ఐదారేళ్ళ పాటు సీక్రేట్ గా ప్రేమించుకున్నారు సిద్ధార్థ్, కియారా. కానిఎక్కడా అఫీషియల్ గా బయటపడలేదు. ట్రోల్స్ పై కూడా పెద్దగా రియాక్ట్ అయ్యేవారు కాదు. తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకునేవారు. ఇక సడెన్ గా పెళ్ళి చేసుకుని షాక్ ఇచ్చారు కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా. పెళ్ళి తరువాతా వారు తమ బంధాన్నిఅఫీషియల్ గా అనౌన్స్ చేశారు.. పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్ళి రాజస్తాన్ లోని ప్యాలస్ లో రంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళికి కొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు, బందువులు మాత్రమే హాజరయ్యారు.. పెళ్లి అయిన అందాల షో చెయ్యడం తగ్గించలేదు..

అయితే తాజాగా కియారా అద్వానీ తల్లి కాబోతుంది అంటూ కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే చాలాసార్లు కియరా అద్వాని ప్రెగ్నెంట్ అంటూ వైరల్ న్యూస్ వినిపించినప్పటికీ ఇందులో ఏది నిజం కాలేదు.కానీ ఇటీవల తన భర్తతో దిగిన ఫోటోలలో పొట్ట కాస్త ఎక్కువగా ఉండటంతో ఆమె ప్రగ్నెంట్ అని తెగ ట్రెండ్ చేస్తున్నారు.. మరి దీనిపై కియారా క్లారిటి ఇవ్వాల్సి ఉంది.. సినిమాల విషయానికొస్తే.. తాజాగా రామ్ చరణ్ కి జంటగా గేమ్ ఛేంజర్ మూవీలో కియారా నటిస్తున్నారు. రామ్ చరణ్ కి జంటగా మరోసారి కియారా నటిస్తుంది.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఇక బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..