Leading News Portal in Telugu

Delhi: ఢిల్లీలో బీజేపీ జాతీయ సమావేశాలు ప్రారంభం.. ఫ్యూచర్ ప్లాన్ వివరించనున్న మోడీ



2024 Bjp Meeting

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) బీజేపీ జాతీయ మండలి సమావేశాలు (National Council Meeting) ప్రారంభమయ్యాయి. భారత్‌ మండపంలో (Bharat Mandapam) జరుగుతున్న ఈ సమావేశాలను ప్రధాని మోడీ (PM Modi), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) జెండా ఎగురవేసి ప్రారంభించారు.

సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా కమలనాథులు బరిలోకి దిగుతున్నారు. బీజేపీకి 370.. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని ఇటీవల ప్రధాని మోడీ పార్లమెంట్‌లో ప్రకటించారు. ఇదే లక్ష్యంగా నేటి నుంచి రెండ్రోజుల పాటు హస్తిన జాతీయ మండలి సమావేశాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ, హ్యా్ట్రిక్ ఎలా కొట్టాలన్నదానిపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.

ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 11,500 మంది పార్టీ సభ్యులు హాజరవుతున్నారు. వీరిలో సర్పంచులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, ఇతర సీనియర్‌ నేతలు ఉంటారు. ఏపీ నుంచి 210 మంది.. తెలంగాణ నుంచి 260 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.

ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఉద్దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై ప్రధాని ప్రసంగించనున్నారు. అలాగే బీజేపీ యొక్క వ్యూహాన్ని కూడా వివరించనున్నారు.