
ఇరాన్‌లో (Iran Firing) ఓ వ్యక్తి ఘాతుకానికి తెగబడ్డాడు. తుపాకీతో కాల్పులకు తెగబడడంతో తండ్రితో సహా 12 మంది బంధువులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడ్ని భద్రతా బలగాలు కాల్చి చంపాయి.
కుటుంబంలో కలహాలు చోటుచేసుకోవడంతో ఓ కుమారుడు విచక్షణ కోల్పోయి రైఫిల్ తీసుకుని కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో తండ్రి, సోదరులు.. మొత్తం 12 మంది బంధువులు ప్రాణాలు వదిలారు. అనంతరం ఇరాన్‌లోని దక్షిణ-మధ్య ప్రావిన్స్ కెర్మాన్‌లో భద్రతా బలగాలు నిందితుడ్ని కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఓ మారుమూల గ్రామీణ ప్రాంతంలో కుటుంబ కలహాల కారణంగా నిందితుడు ఈ కాల్పులకు తెగబడినట్లు వారు తెలిపారు.
రెండేళ్ల క్రితం పశ్చిమ ఇరాన్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రభుత్వ సంస్థ నుంచి తొలగించబడిన ఓ ఉద్యోగి ముగ్గురిని కాల్చి చంపాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.