Leading News Portal in Telugu

Amritpal Singh: వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ జైలు గది నుంచి సెల్‌ఫోన్, స్పైకామ్



Amiritpal Singh

Amritpal Singh: ఖలిస్తానీ నేత, వివాదాస్పద వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్, అతని అనుచరులు అస్సాంలోని అత్యంత భద్రత కలిగిన జైలులో ఉన్నారు. అస్సాంలోని దిబ్రూగఢ్ సెంట్రల్ జైలో భారీ భద్రత కలిగిన జైలులో భద్రత ఉల్లంఘన వెలుగులోకి వచ్చింది. వేర్పాటువాద నేత, అతని 9 మంది సహచరులు ఉన్న సెల్ నుంచి స్పై కెమెరాలు, స్మార్ట్ ఫోన్, కీప్యాడ్ ఫోన్, పెన్ డ్రైవ్స్, బ్లూటూత్ హెడ్ ఫోన్స్, స్పీకర్లు, స్మార్ట్ వాచ్ ఇతర వస్తువులను అధికారులు ఈ రోజు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Anuskha Shetty: ‘శీలవతి’గా సరోజ?

ఈ ఘటనపై అస్సాం ఉన్నత పోలీస్ అధికారి జీపీ సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సెక్యూరిటీని మరింత టైట్ చేసినట్లు, సీసీకెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఉదయం జైలు సిబ్బంది జైల్ గదుల్లో శోధించగా.. పలు వస్తువులు బయటపడినట్లు తెలిపారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

గతేడాది సిక్కులకు ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కావాలని, దేశంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేలా, ర్యాడికల్ బోధనలు చేసిన అమృత్‌పాల్ సింగ్‌ని కొన్ని వారాల తర్వాత పంజాబ్ మోగా జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేసి, దిబ్రూగఢ్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇతనిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద అభియోగాలు మోపారు.