Leading News Portal in Telugu

AP Governor: ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య



Ap Governor

AP Governor: ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఏపీ గవర్నర్‌.. జ్యోతి ప్రజ్వలన చేసి సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ రాజాబాబు, కళాశాల డైరెక్టర్లు పాల్గొన్నారు.

Read Also: Undavalli Arun Kumar: పోలవరం ప్రాజెక్టును కూడా కేంద్రం పట్టించుకోవడం లేదు..

యువత ఉన్న సమయాన్ని పెంచుకోవడం.. అందుబాటులో ఉన్న సమయంలో సాధించగలిగే వాటిని పెంచుకోవడంపై దృష్టి సారించాలని గవర్నర్ సూచించారు. యాక్సెస్, క్వాలిటీ, ఈక్విటీ, స్థోమత, జవాబుదారీతనం అనే స్తంభాలపై నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ -2020 ఆధారపడి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధతో ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేలా దృష్టి సారిస్తుందన్నారు. వచ్చే 25ఏళ్ల ‘అమృత్ కాల్’ సమయంలో భారతదేశం నైపుణ్యం కలిగిన మానవశక్తిగా ప్రపంచం ముందు నిలుస్తుందన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి దేశంగా మార్చాలనే భారత ప్రభుత్వ చర్యలు చేపడుతోందన్నారు.