Leading News Portal in Telugu

IND vs ENG: 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం.. 2024లో మొదటి సిక్స్ కొట్టిన టీమిండియా ప్లేయర్!



Kuldeep Yadav Six

First six for Kuldeep Yadav in International cricket: టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటి సిక్స్ బాదాడు. రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో కుల్దీప్ సిక్సర్ కొట్టాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ వేసిన 56వ ఓవర్‌లో లాంగ్-ఆన్ వైపు భారీ సిక్సర్ కొట్టాడు. ముందుకొచ్చి మరీ సూపర్బ్ షాట్ ఆడాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Chiranjeevi-Surekha: సతీమణి బర్త్‌డే.. మెగాస్టార్ ‘చిరు’ కవిత! ఫాన్స్ ఫిదా

కుల్దీప్ యాదవ్ 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 10 టెస్టులు, 103 వన్డేలు, 35 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో ఎప్పుడూ సిక్స్ కొట్టలేదు. టెస్టుల్లో 14, వన్డేల్లో 14, టీ20ల్లో 2 ఫోర్లు బాదిన కుల్దీప్.. తాజాగా సిక్సర్ ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవలి కాలంలో కుల్దీప్ తన బ్యాటింగ్‌లో చాలా మెరుగుపడ్డాడు. రాజ్‌కోట్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నైట్‌ వాచ్‌మెన్‌గా క్రీజులోకి వచ్చాడు. మూడో రోజు ఇంగ్లిష్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న అతడు.. నాలుగో రోజు కూడా బాగా బ్యాటింగ్ చేశాడు. 91 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 27 పరుగులు చేశాడు. భారత ఇన్నింగ్స్‌లో కుల్దీప్ కొట్టిన సిక్స్ ప్రత్యేకం అని చెప్పొచ్చు.