Leading News Portal in Telugu

Purandeswari: పొత్తులపై చర్చలకు అధిష్టానం పిలిస్తే కలుస్తాం..



Purandeshwari

ప్రస్తుతం పొత్తులపై బీజేపీ అధిష్ఠానం ఏపీ నాయకత్వంతో మాట్లాడే అవకాశం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. అధిష్ఠానం మళ్లీ పిలిస్తేనే ఏపీ బీజేపీ నేతల బృందం చర్చల కోసం వస్తామని చెప్పారు. ఎప్పుడు చర్చల కోసం పిలుస్తారో తెలియదు.. చెప్పలేమన్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశాల్లో పురేంధేశ్వరీ పాల్గొన్నారు. దాదాపు ఏపీ నుంచి 270 మందికి పైగా ప్రతినిధులు వచ్చారు.

Read Also: CM Jagan: నీ సైకిల్‌ తోయడానికి నీకొక ప్యాకేజీ స్టార్‌ ఎందుకయ్యా..? సీఎం సెటైర్లు

ఈ సమావేశాల్లో పార్టీ 10 సంవత్సరాలు ఏం చేసింది.. ఏం చేయాలన్న దానిపై చర్చ జరిగిందని తెలిపారు. ఈరోజు ప్రధాని మంత్రి సందేశాలు, మార్గదర్శకాలు ఇచ్చారని పేర్కొన్నారు. గత 70 ఏళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిష్కరించలేకపోయిన పలు సమస్యలను.. గత పదేళ్ళలో చేయగలిగామని ప్రధాని మోడి చేసిన ప్రసంగంలో సవివరంగా ప్రస్తావించారు. లబ్దిదారుల ఇంటింటికి వెళ్ళి, ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు తన రఫున ప్రణామాలు తెలియజేయమని ప్రధాని మోడీ సూచించారు. మోడీ సందేశాన్ని ఇంటింటికి తీసుకెళ్తామన్నారు. మరోవైపు.. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాల ప్రభావం ఏపీలో కూడా ఖచ్చితంగా, గణనీయంగా ఉంటుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని పురంధేశ్వరీ చెప్పారు.

Read Also: Mamata Banerjee: కేంద్రం ఆధార్ కార్డుల్ని డీయాక్టివేట్ చేస్తోంది.. మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు..