Leading News Portal in Telugu

Malaikottai Vaaliban :అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తున్న మోహన్ లాల్ మూవీ..?



Whatsapp Image 2024 02 18 At 11.16.59 Pm

మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ హీరోగా నటించిన మలైకొట్టై వాలిబన్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా గ్రాండ్‍గా తెరకెక్కిన ఈ మూవీ జనవరి 25న రిలీజ్ అయింది.ఈ మూవీని జానీ, మేరీ క్రియేటివ్ ఫిల్మ్స్, మ్యాక్స్ ల్యాబ్ సినిమాస్, సరేగామా మరియు ఆమెన్ మూవీ మొనాస్ట్రీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.లిజో జోస్ పిలిసెరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం నిరాశపరిచింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇప్పుడు మలైకొట్టై వాలిబన్ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.మలైకొట్టై వాలిబన్ సినిమా ఫిబ్రవరి 23వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానున్నట్లు తెలుస్తుంది.అంటే థియేటర్లలో రిలీజైన నెలలోపే ఈ చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై హాట్‍స్టార్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అతి త్వరలోనే హాట్ స్టార్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మలైకొట్టై వాలిబన్ సినిమా అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలోకి వస్తోంది. మార్చి 1వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుందని ముందుగా సమాచారం బయటికి వచ్చింది. అయితే, థియేట్రికల్ రన్ ఇప్పటికే ముగిసిపోవటంతో ఫిబ్రవరి 23నే డిస్నీ+ హాట్‍స్టార్‌లో స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు ఈ మూవీ రెడీ అవుతోంది.మలైకొట్టై వాలిబన్ చిత్రం హాట్‍స్టార్ ఓటీటీలో ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్ కానుంది. అయితే, తెలుగు వెర్షన్ అందుబాటులోకి వస్తుందా లేదా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ముందుగా ఈ చిత్రాన్ని తెలుగులో కూడా థియేటర్లలో రిలీజ్ చేయాలని మూవీ టీమ్ భావించింది. అయితే, అది సాధ్యం కాలేదు. అందులోను ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావటంతో తెలుగు వెర్షన్ ను తీసుకురాలేదు. మరి ఓటీటీలో అయినా మలైకొట్టై వాలిబన్ తెలుగు డబ్బింగ్‍లో వస్తుందో లేదో చూడాలి