Leading News Portal in Telugu

Pawan Kalyan: నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పవన్‌ పర్యటన



Pawankalyan Janasena

Pawan Kalyan: నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో వేర్వేరుగా భేటీ కానున్నారు. టికెట్‌ ఆశావహులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మూడు పార్టీల పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటులో ఆశించిన వాళ్ళందరికీ అవకాశం రాకపోవచ్చనే విషయం చెప్పే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం తర్వాత పవన్‌ రాజమండ్రి వెళ్లనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నేతలతో రాజమండ్రిలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కీలక నేతలతో ఎన్నికల గురించి చర్చించనున్నట్లు సమాచారం. సాయంత్రం ప్రత్యేక విమానంలో పవన్‌ కల్యాణ్ ‌ మంగళగిరి వెళ్లనున్నారు.

Read Also: Tirumala: నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల

ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని చాలాకాలం కిందటే నిర్ణయం తీసుకున్నాయి. ఒకవేళ బీజేపీ కూడా సై అంటే, సీట్ల పంపకాలపై ఇబ్బంది తలెత్తకపోతే ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి జగన్‌ను గద్దె దించాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇది వరకే పవన్, చంద్రబాబు పలుమార్లు సమావేశమై పొత్తులపై, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించడం తెలిసిందే. కానీ బీజేపీ తమతో జతకడితే తిరుగుండదని భావించి, సీట్ల పంపకాలు జరగలేదన్న వాదన కూడా ఉంది.