Leading News Portal in Telugu

Pooja Hegde: ట్రెడిషినల్ లుక్ ఎంత అందంగా ఉందో.. బుట్టబొమ్మ స్టిల్స్ అదుర్స్..



Puja (2)

టాలివుడ్ ముద్దుగుమ్మ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ప్లాప్ సినిమాలు ఒకవైపు పలకరిస్తున్నా కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. ఇక సోషక్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో ఎల్లో శారీలో వయ్యారాలను వలకబోసింది బుట్టబొమ్మ.. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..

ఈ అమ్మడు ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. టాలీవుడ్‌లో టాప్‌ స్టార్స్ తో కలిసి నటించింది. ప్రభాస్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, బన్నీ, రామ్‌చరణ్‌ వంటి వారితోనూ కలిసి నటించింది. యంగ్‌ హీరోలతోనూ జోడీ కట్టింది. వరుస అవకాశాలే కాదు, వరుస విజయాలతోనూ లక్కీ హీరోయిన్‌గా మారింది… కానీ గతేడాది ఈ బ్యూటీకి కలిసి రాలేదు. ఊహించని దెబ్బలు తగిలాయి. నటించిన నాలుగు సినిమాలు ప్లాప్ అయ్యాయి.. గత కొంత కాలం నుంచి పూజా హెగ్డే కి సౌత్ లో కలసి రావడం లేదు. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే..ఈ ఏడాది వరుస సినిమాలను లైన్లో పెడుతుంది..

సినిమాల్లో అలరించనప్పటికీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన గ్లామర్, ట్రెడిషన్‌ లుక్‌తో నెటిజన్లను కుదురుగా ఉండనివ్వదు. తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. గ్లామర్ మెరుపులతో యువతను చూపుతిప్పుకోనియకుండా చేస్తుంటుంది. తాజాగా ఎల్లో శారీ కట్టుకొని.. కొప్పునిండా పూలు పెట్టుకుని బాపు బొమ్మలాగా ఉంది.. క్యూట్ స్మైల్ తో కుర్రాళ్ల గుండెలను పిండేసే స్టిల్స్ ఇచ్చింది.. ఎప్పుడూ హాట్ గా కనిపించే ఈ అమ్మడును ఇలా చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. చాలా అందంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు.. అంతేకాదు పూజా హెగ్డే ఫొటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు…