Leading News Portal in Telugu

Airtel-Amazon Prime: ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్‌ ప్లాన్స్.. ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ వీడియో!



Airtel

Airtel Gives Free Amazon Prime Video Subscription in Rs.699 Plan: ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు ఓటీటీలోనే సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, ఆహాలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్‌ ప్లాన్‌లను అందుకు అనుగుణంగా రూపొందిస్తున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో నచ్చిన సినిమాలు, టీవీ షోలు చూసేందుకు ప్రముఖ టెలికాం కంపెనీ ‘ఎయిర్‌టెల్‌’ రెండు ప్లాన్‌లను అందిస్తోంది. అవేంటో తెలుసుకుందాం.

Airtel Rs.699 Plan:
ఎయిర్‌టెల్‌ యూజర్లు రూ.699తో రీఛార్జ్ చేస్తే.. 56 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ ఉపయోగించుకోవచ్చు. రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో భాగంగా 56 రోజుల పాటు అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌, అపరిమిత 5జీ డేటా, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే, అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్స్‌, వింక్‌ మ్యూజిక్‌ సభ్యత్వం లాంటి ఫీచర్లు అదనంగా లభిస్తాయి.

Also Read: IND vs ENG: మేం అయోమయానికి గురయ్యాం.. ఎవరినీ బ్లేమ్ చేయడం లేదు: బెన్‌ స్టోక్స్

Airtel Rs.999 Plan:
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ కోసం ఎయిర్‌టెల్‌ అందిస్తున్న మరో ప్లాన్‌ రూ.999. ఈ ప్లాన్‌లో భాగంగా 84 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ చేసుకోవచ్చు. రోజుకు 2.5జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. 84 రోజుల పాటు అమెజాన్‌ ప్రైమ్‌ కంటెంట్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే, రివార్డ్స్‌ మినీ సబ్‌స్క్రిప్షన్‌, అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్స్‌, వింక్‌ మ్యూజిక్‌ వంటి ప్రయోజనాలూ అదనం. ఇక పోస్ట్‌పెయిడ్‌ యూజర్లు రూ.499 నుంచి రూ.1,199 వరకు ఉన్న ప్లాన్‌లలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు.