Leading News Portal in Telugu

Ooru Peru Bhairavakona Collections: ‘ఊరు పేరు భైరవకోన ‘ 3రోజుల్లో ఎంత రాబట్టిందంటే?



Sandeepp (2)

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సరికొత్త కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.. అయితే ఈ హీరో ఖాతాలో హిట్ పడి చాలా కాలం అయ్యింది.. తాజాగా ‘ఊరు పేరు భైరవకోన ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఈ సినిమా నిన్న విడుదలైంది.. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా ఈ మూవీని నిర్మించారు.. ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీగానే లభించింది. దీంతో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మరి సందీప్ ‘ఊరు పేరు భైరవకోన’ మూడు రోజుల్లో ఎంత కలెక్షన్లను రాబాట్టిందో చూద్దాం..

వీఐ ఆనంద్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటించిన హర్రర్ అండ్ థ్రిల్లర్ సినిమానే ‘ఊరు పేరు భైరవకోన’. ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ను అందించారు.. ఈ సినిమాలో ప్రముఖులు కీలక పాత్రలో నటించారు.. ఈ సినిమాకు బిజినెస్ బాగానే జరిగింది.. ఇక కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి.. 30 కోట్ల క్లబ్ లోకి చేరింది.. ఎంత రాబడుతుందో చూడాలి..

సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.. 3వ రోజు ఈ మూవీకి భారీ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ సినిమా రూ. 1.50 కోట్లు షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 1.80 కోట్లు వసూలు చేసింది. ఇలా 3 రోజుల్లోనే రూ. 6.60 కోట్లను కలెక్ట్ చేసింది.. మొత్తం మూడు రోజులకు కలిపి రూ. 20.30 కోట్లను రాబట్టింది.. ఇంకా సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది..