Leading News Portal in Telugu

US Strikes Houthi Rebels: హౌతి రెబల్స్ పై మరోసారి అమెరికా దాడి..



Us

యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్ల స్థావరాలపై అగ్రరాజ్యం అమెరికా ఆర్మీ మరోసారి దాడులు చేసింది. ఈ విషయాన్ని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది. హౌతీ రెబల్స్ కు చెందిన యాంటీ షిప్‌ క్రూయిజ్‌ మిసైళ్లు, మానవ రహిత ఉపరితల ఓడ, మానవ రహిత జలాంతర్గామిపై దాడులు జరిపినట్లు పేర్కొనింది. ఎర్ర సముద్రంలో అమెరికాకు చెందిన వాణిజ్య నౌకలు, ఇతర దేశాల మధ్య సముద్ర రవాణాకు హౌతీ తిరుగుబాటుదారుల నుంచి పెను ముప్పు పొంచి ఉంది. హౌతీ రెబల్స్ తొలిసారిగా మానవరహిత జలాంతర్గాములను సైతం వాడుతున్నారు.

Read Also: Medarama Jathara: జాతర మార్గంలో క్యాంపులు.. అందుబాటులో క్రేన్లు

ఇక, ఎర్ర సముద్రంలో రవాణాను రక్షించేందుకే హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై ఆత్మరక్షణ దాడులు చేశాం అని అమెరికా సెంట్‌కామ్‌ అధికారులు తెలిపారు. పాలస్తీనాకు మద్దతుగా కేవలం ఇజ్రాయెల్‌ నౌకలపైనే దాడులు చేస్తామని తొలుత ప్రకటించిన హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రం నుంచి వెళ్లే అమెరికా, బ్రిటన్‌తో పాటు ఇతర దేశాల వాణిజ్య నౌకలపైనా వరుసగా దాడులు చేస్తుండటం వల్ల ఆసియా నుంచి అమెరికా వెళ్లే వాణిజ్య నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.