Leading News Portal in Telugu

Vivo Y200e 5G: మార్కెట్లోకి వచ్చేస్తున్న వీవో స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్?



Vivo Y200

ప్రముఖ మొబైల్ కంపెనీ వివో కంపెనీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల వదిలింది.. వివో వY200ఈ ప్రో పేరుతో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది.. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్ 6.67 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కెమెరా 50 మెగా ఫిక్సల్ ప్రైమరీ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 2 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరాలు ఉంటాయి. ఇక…Y200ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సపోర్ట్ 5000 ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.. ఇకపోతే ఈ ఫోన్ ఈ నెల 22 ను భారత్ లోకి తీసుకొని రానున్నారు..

ఈ స్మార్ట్‌ఫోన్ 6GB మరియు 8GB యొక్క RAM కాన్ఫిగరేషన్‌లను అందజేస్తుంది. 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో ఉండనుంది. ఇక ఈ మొబైల్‌ ఫోన్‌ కొనుగోళ్లు, ధరలపై ఫిబ్రవరి 22వ తేదీన క్లారిటీ రానుంది.. స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 SoC ద్వారా అందించబడుతుందని అంచనా వేయబడింది.. ఇక ఆండ్రాయిడ్ 13 తో పని చేస్తుంది… ఇంకా అనేక ఫీచర్స్ ను కలిగి ఉందని చెబుతున్నారు.. బుకింగ్స్ కూడా మొదలైనట్లు తెలుస్తుంది..