Leading News Portal in Telugu

Premalu: 12.5 కోట్ల బడ్జెట్.. 10 రోజుల్లోనే 50 కోట్ల కలెక్షన్లు.. బ్లాక్ బస్టర్ ‘ప్రేమలు’



Premalu Movie

Premalu Movie Enters 50 Crore Club in Malayalam: యాభై కోట్ల క్లబ్‌లో మలయాళ మూవీ ‘ప్రేమలు’ చోటు దక్కించుకుంది. పది రోజుల్లోనే ఈ సినిమా గ్లోబల్ కలెక్షన్స్ 42 కోట్లు దాటేసి 50కి చేరువ అయినట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. గిరీష్ ఏడీ డైరెక్ట్ చేసిన ఈ ప్రేమలు సినిమా కేరళలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, సహా తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ హిట్ అయ్యింది. ‘ప్రేమలు’ సినిమా షూటింగ్‌ ఎక్కువగా హైదరాబాద్ లో జరుపుకుంది. ఇక ఈ సినిమా మలయాళం మాత్రమే రిలీజ్ అయినా సబ్ టైటిల్స్ తో సినిమాను చూసేందుకు యూత్ ఆసక్తి చూపిస్తోంది. ఆదివారం ఒక్క కేరళ నుంచే ఈ సినిమాకి రూ.3 కోట్లు వచ్చాయి. ఇక ఈ సినిమా మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా 26 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించడం కూడా మలయాళ సినిమాల్లో ఒక రికార్డు అని తెలుస్తోంది.

Bramayugam: సితార ఎంటర్టైన్మెంట్స్ సమర్పించు ‘భ్రమయుగం’.. తెలుగులో ఆరోజే రిలీజ్

మొదటి రోజు 90 లక్షలు కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు రెండింతల కలెక్షన్స్ అందుకుంది. తర్వాత సినిమా వేరే లేవల్లోకి వెళ్ళింది. మల్టీప్లెక్స్‌లతోపాటు సింగిల్ థియేటర్స్ లో సైతం హౌస్‌ఫుల్‌గా సినిమా ప్రదర్శితమవుతోందని తెలుస్తోంది. ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. రెండో వారంలో కూడా ఈ చిత్రం కేరళ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలోకి ప్రవేశించింది. ఇది పూర్తి స్థాయి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. ‘ప్రేమలు’ చిత్రాన్ని దిలీష్ పోతన్, ఫహద్ ఫాజిల్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. బడ్జెట్ విషయానికొస్తే, దాదాపు 12.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పెట్టుబడిని రికవరీ చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన మలయాళ చిత్రాలలో బ్లాక్ బస్టర్ వైపు ప్రేమలు విజయ ప్రయాణం సాగుతోంది. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాసల్, మమితా బైజు, శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన్, సంగీత్ ప్రతాప్, అల్తాఫ్ సలీం, మీనాక్షి రవీంద్రన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను గిరీష్ ఎడి, కిరణ్ జోషి అందించారు.