Leading News Portal in Telugu

AP High Court: టెట్‌, డీఎస్సీపై హైకోర్టులో విచారణ.. సమయం ఇవ్వాలి కదా?



Ap High Court

AP High Court: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. టెట్‌, డీఎస్సీ పరీక్షల నిర్వహణకు సిద్ధం అవుతోంది.. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల కాగా.. అభ్యర్థులు ఫిబ్రవరి 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మొత్తంగా 6100 టీచర్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. అయితే, ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (TET) , డీఎస్సీ సమయం ఇవ్వకుండా పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. చాలినంత సమయం ఇవ్వకుండా పరీక్షల నిర్వహణపై హైకోర్ట్ లో పిటిషన్లు వేశారు.. పిటిషన్లు పై వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు, హైకోర్ట్ సీనియర్ న్యాయవాది జవ్వాది శరత్ చంద్ర.. TET ఫలితాలు మార్చి 14న ఇచ్చి, డీఎస్సీకి 15 న పరీక్ష నిర్వహించడంపై పిటిషనర్ తరపు న్యాయవాదుల అభ్యంతరం వ్యక్తం చేశారు.. రెండు పరీక్షలకు హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేయడంలో కూడా ఇబ్బందులు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఐదు వారాల్లో మొత్తం పరీక్ష ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.. అయితే, తగిన సమయం ఇవ్వాలి కదా? అని ప్రభుత్వ న్యాయవాదిని ఈ సందర్భంగా ప్రశ్నించింది హైకోర్టు.. ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో.. కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు..

Read Also: Smriti Irani: రాహుల్‌కి స్మృతిఇరానీ సవాల్