Leading News Portal in Telugu

Mamata: ఆధార్‌పై ప్రధాని మోడీకి మమత ఘాటు లేఖ



Mdoe

పశ్చిమబెంగాల్‌లో ఆధార్ కార్డులను డీయాక్టివేషన్ (Aadhaar Deactivation) చేయడంపై ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee) సీరియస్ అయ్యారు. ఈ మేరకు ప్రధాని మోడీకి (PM Modi) ఘాటు లేఖ రాశారు. ఆధార్ కార్డులను నిర్ల్యక్షపూరితంగా డీయాక్టివేట్ చేయడాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. ఆధార్ కార్డులు ఎందుకు పనిచేయకుండా చేస్తు్న్నారని మోడీని నిలదీశారు. ఆధార్ కార్డులు పనిచేయకపోవడం వల్ల బెంగాల్‌లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు భయాందోళనలు సృష్టించడంపై మంచిది కాదని లేఖలో మమత స్పష్టం చేశారు.

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్ర సంక్షేమ పథకాలు ప్రజలకు చేరకుండా ఉండేందుకు బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ కార్డులు పనిచేయకుండా చేస్తోందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మమతా మాట్లాడారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ కార్డులను క్రియారహితం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే బెంగాల్‌లో చాలా చోట్ల ఆధార్‌కార్డులు పనిచేయట్లేదన్నారు. ఎన్నికల ముందు ఆధార్‌ను క్రియారహితం చేసి లక్ష్మీ భండార్‌, ఉచిత రేషన్‌ వంటి పథకాలను ప్రజలకు అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఆధార్‌కార్డు లేకపోయినా తమ ప్రభుత్వం పథకాల అమలు చేసేలా ప్రధాన కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 50మంది ఆధార్‌కార్డులు పనిచేయడం లేదని మమతా ఆరోపించారు.

తాజాగా మమతా బెనర్జీ రాసిన లేఖపై ప్రధాని మోడీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మమతా ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్నారు. మోడీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రాసిన లేఖపై స్పందిస్తారో లేదో వేచి చూడాలి.