Leading News Portal in Telugu

KA Paul: సీఎం జగన్‌, చంద్రబాబుకు కేఏ పాల్‌ సవాల్‌.. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా..!



Ka Paul

KA Paul: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్‌ విసిరారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, వైఎస్‌ జగన్ నా సవాల్ తీసుకుంటారా? అని ప్రశ్నించారు.. జగన్ కి నేనొక అవకాశం ఇస్తున్నా.. నాతో కలవమనండి..! అని సూచించారు. ఇక, జగన్, చంద్రబాబుని సిద్ధమా అంటున్నాడు.. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చంద్రబాబు, జగన్ కి నా సవాల్.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కి విగ్రహం అవసరమా..? అని ప్రశ్నించారు. దళితులు విగ్రహలతో మోసపోరు అని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల వారికి నా విన్నపం.. టీడీపీ, జనసేన, వైసీపీని వీడి భయటకు రండి.. ఈ మూడు పార్టీలు బీజేపీ తొత్తులు అని విమర్శించారు. బీఆర్ అంబేద్కర్ రాజ్యాధికారం కావాలని అడిగాడు…. కానీ, విగ్రహాలు పెట్టమని అంబేద్కర్ అడిగాడా? అని నిలదీశారు. అయితే.. నేను ఏ మతాన్ని, కులాన్ని విమర్శించను అన్నారు.

Read Also: Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌

ఇక, పవన్‌ కల్యాణ్‌ పార్టీ జనసేనకు ఓట్లు లేవు కాబట్టి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటాడు అంటూ విమర్శలు గుప్పించారు పాల్.. మరోవైపు వైఎస్‌ జగన్‌ చొక్కాలు మడత పెట్టాలని అంటున్నాడు.. చంద్రబాబు కుర్చీలు ఎత్తమంటున్నాడు.. వాళ్లందరని మడతపెట్టేయలని పిలుపునిచ్చారు. ఇక, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. కాగా, గతంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేఏ పాల్ పోటీ చేసిన విషయం విదితమే కాగా.. ఆయన పార్టీకి చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు రాని విషయం తెలిసిందే.