Leading News Portal in Telugu

Governor Tamilisai: గవర్నర్‌ ‘ఎక్స్‌’ ఖాతా హ్యాక్‌ షాకింగ్ విషయాలు.. ముంబై నుంచే..



Governer Tamilisai

Governor Tamilisai: గవర్నర్‌ తమిళి సై ‘ఎక్స్‌’ ఖాతా హ్యాక్‌ విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. ముంబై నుంచే గవర్నర్‌ తమిళి సై ‘ఎక్స్‌’ ఖాతా హ్యాక్‌ అయినట్లు గుర్తించారు. అక్కడి ఓ బొటెక్‌ వైఫై నెట్‌వర్క్‌ను దుండగుడు వినియోగించినట్లు అధికారులు కనుగొన్నారు. ఈ హ్యాక్ పై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. ఆ సంస్థ నిర్వాహకురాలిని ప్రశ్నించినా వివరాలు బయటకు రావడంతో షాక్ తిన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల దర్వారా అన్వేషిస్తున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా బోటిక్ మూసి వేసినట్లు గమనించారు. అయితే.. గవర్నర్ ఎక్స్ అకౌంట్ ఎందుకు హ్యాక్ చేశారు? పర్యటన వివరాలు తెలుసుకునేందుకు ఇలా చేశారా? లేక ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 14న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ X ఖాతా హ్యాక్ అయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మూడు కొత్త IP చిరునామాలు గుర్తించారు.

Read also: VC Sajjanar: మేడారం వెళ్లే ప్రయాణికులకు విజ్ఞప్తి.. సజ్జనార్ సూచనలు

సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లు ఐపీ అడ్రస్‌ల ద్వారా వివరాలను పంపాలని కోరారు. అందిన సమాచారంతో సైబర్ క్రైమ్ పోలీసులు ముంబై నుంచి అకౌంట్ హ్యాక్ అయినట్లు గుర్తించారు. అయితే.. కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతిక్రమించారంటూ ఎక్స్ కంపెనీ నుంచి గవర్నర్ తమిళ్ సాయికి మెయిల్ వచ్చినట్లు సమాచారం. దీంతో గవర్నర్ తన ఖాతా తెరవడానికి ప్రయత్నించగా పాస్‌వర్డ్ తప్పు వస్తుందని అధికారులు వెల్లడించారు. తమిళిసైకి సంబంధం లేని పోస్టులు ఇచ్చారు. గవర్నర్ తమిళిసై ఆదేశాల మేరకు రాజ్ భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఖాతాను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అయిన సంగతి తెలిసిందే.
Hyderabad ORR Accident: ఓఆర్ఆర్ కారు ప్రమాదంపై లేటెస్ట్ అప్డేట్.. 170 స్పీడ్ లో కారు