Tribal Welfare Officer: ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి అరెస్ట్.. రూ.15 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తింపు

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జగజ్యోతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రూ.15 కోట్ల మేర అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు అధికారులు తేల్చారు. జ్యోతి ఇంట్లో 65 లక్షల రూపాయల నగదుతో పాటు.. నాలుగు కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. కోటిన్నర రూపాయల అక్రమ ఆస్తులు ఉన్నట్లు తేల్చారు. ఫ్లాట్లు, ఫ్లాట్, ఇళ్ల స్థలాలు వ్యవసాయ భూములకు సంబంధించి కీలక డాక్యుమెంట్లను అధికారులు గుర్తించారు. అరెస్ట్ అనంతరం ఆమెను కోర్టులో ప్రవేశ పెట్టగా 14 రోజుల రిమాడ్ విధించారు. దీంతో జ్యోతిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Sonia Gandhi: రాజ్యసభ ఎంపీగా సోనియా గాంధీ ఏకగ్రీవ ఎన్నిక..
అంతకుముందు ఏసీబీ అధికారులకు జ్యోతి చుక్కలు చూపించింది. అధికారులు ఆమెను రిమాండ్ తరలించేందుకు సిద్ధం చేయగా ఛాతి నొప్పంటూ నాటకమాడింది. దీంతో హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ పరీక్షల్లో నార్మల్ గా రావడంతో కోర్టుకు తరలించే ప్రయత్నం చేశారు. మళ్లీ.. గుండెనొప్పి అంటూ చెప్పడంతో గుండె పరీక్షలు నిర్వహించారు. మొత్తానికి నాటకమంతా బయటపడటంతో ఆమెను అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించారు.
Gudivada Amarnath Return Gift: లోకేష్‌కి మంత్రి అమర్నాథ్ రిటర్న్ గిఫ్ట్.. మట్టి కుండలో ఉత్తరాంధ్ర ఉప్పు, కారం కలిపిన పప్పు..!