
Konakalla Narayana: ఎన్నికల సమయంలో కొందరు నేతలు.. కొన్ని గంటల్లోనే పార్టీ కండువా మార్చేస్తున్నారు.. మరికొందరు అలా వెళ్లి ఇలా మళ్లీ వెనక్కి వస్తున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఎవరికి తోచిన ప్రచారం వాళ్లు చేస్తున్నారు.. తాజాగా, టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ.. పార్టీ మార్పుపై సోషల్ మీడియా వేదిక వారే నడుస్తోంది.. మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ.. టీడీపీకి గుడ్‌బై చెబుతారని.. త్వరలోనే వైసీపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.. ఫేస్ బుక్, వాట్సప్ గ్రూప్స్ లో వైరల్ గా మారిపోయింది కొనకళ్లకు సంబంధించిన పోస్టు.. అయితే, ఇది వైసీపీ మైండ్ గేమ్ అని కొనకళ్ల పార్టీ మారటం జరగదని, ఇది ఫేక్ ప్రచారం అంటూ సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తూ వచ్చారు కొనకళ్ల అనుచరులు..
Read Also: Nuzvid: నూజివీడులో ఆసక్తికర పరిణామాలు.. ఇంఛార్జ్‌ని ప్రకటించిన టీడీపీ
ఇక, పార్టీ మార్పు వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు కొనకళ్ల.. వైసీపీలో చేరికపై టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ స్పందిస్తూ.. రెండు రోజులుగా వైసీపీలో కొనకళ్ల చేరుతున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోనే కొనసాగుతాను అని ప్రకటించారు. వైసీపీలో చేరుతున్నా అని జరుగుతున్న ప్రచారం సత్యదూరం.. ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు.. నాకు వైసీపీలో చేరే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల మా క్రెడిబిలిటీ దెబ్బ తింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం కోసం పనిచేస్తాను అని స్పష్టం చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ. కాగా, బందరు నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచి ఆయన.. గత ఎన్నికల్లో ఓడిపోయారు.. వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ పొత్తులో భాగంగా జనసేనకి కేటాయించే ఆలోచనలో అధిష్టానం ఉందని.. దీంతో కొనకళ్లతో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్టు ప్రచారం జరగడంతో.. చివరకు అలాంటి ఏమీ లేదని ఆయనే క్లారిటీ ఇచ్చారు.