Leading News Portal in Telugu

IPL 2024: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఈసారి ఇండియాలోనే ఐపీఎల్



Ipl

క్రికెట్ అభిమానులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ శుభవార్త చెప్పింది. ఐపీఎల్ ఇండియాలో ఉంటుందా లేదా అనే దానిపై క్లారిటీ ఇచ్చింది. భారత్ లోనే ఐపీఎల్ 2024 నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా.. మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయని ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు.

AKhilesh: ఇండియా కూటమికి మళ్లీ షాక్.. మరో 9 మంది అభ్యర్థుల ప్రకటన

లోక్ సభ, సార్వత్రిక ఎన్నికల కారణంగా ఇండియాలో కాకుండా.. దుబాయ్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ తొలుత భావించింది. కానీ ఇండియాలోనే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే.. ఐపీఎల్ 2024 రెండు దశల్లో నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి తొలి 15 రోజుల షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించనుంది. లోక్‍సభ ఎన్నికల తేదీలు వచ్చాక.. మిగిలిన షెడ్యూల్ ప్రకటించనుంది. మార్చి మొదటి వారంలో తొలి దశ షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశం ఉంది.

Tantra : ఆడియన్స్ ను భయపెట్టేందుకు వచ్చేస్తున్న “తంత్ర”.. రిలీజ్ ఎప్పుడంటే..?

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. గతేడాది టైటిల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ గుజరాత్ టైటాన్స్ మధ్య తొలి మ్యాచ్ ఉండనుంది. అయితే సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009లో ఐపీఎల్ సీజన్ మొత్తాన్ని బీసీసీఐ దక్షిణాఫ్రికాలో నిర్వహించింది. 2014 సీజన్‍లో కూడా కొన్ని మ్యాచ్ లు యూఏఈలో నిర్వహించారు. అంతేకాకుండా.. 2019లో ఎన్నికలు ఉన్నా మొత్తం సీజన్ భారత్‍లోనే నిర్వహించింది బీసీసీఐ. తాజాగా.. ఈ ఏడాది ఎన్నికలు ఉన్నా కూడా పూర్తిగా ఇండియాలోనే నిర్వహించాలని బీసీసీఐ భావించింది.