Leading News Portal in Telugu

Tribal Welfare Officer: ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతికి అస్వస్థత.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స



Tribal Welfare Officer Jyothi

Tribal Welfare Officer: లంచం కేసులో అరెస్ట్ అయిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి అస్వస్థత గురయ్యారు. కొద్ది గంటల్లో కోర్టులో హాజరుకానుండగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఏసీబీ అధికారులు ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ఉస్మానియా హాస్పిటల్ సూపర్డెంట్ నాగేందర్ చికిత్స అందిస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి ని చాతినొప్పి వచ్చిందని ఏసీబీ అధికారులు తీసుకొచ్చారు. జ్యోతిని అడ్మిట్ చేసుకున్నామని నాగేదంర్ తెలిపారు. జ్యోతికి ఈసీజే, బీపీ, బ్లడ్ టెస్ట్ లు, బ్లడ్ షుగర్, గుండెకి సంబంధించిన అన్ని టెస్టులు చేశామని, నార్మల్ గా ఉన్నాయని తెలిపారు. జ్యోతికి ప్రస్తుతం టుడేఈకో టెస్ట్ చేసిన తర్వాత డిశ్చార్జి చేస్తామన్నారు. జ్యోతి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని నాగేందర్ తెలిపారు.

Read also: Kishan Reddy: విజయసంకల్ప రథ యాత్రలకు బీజేపీ శ్రీకారం.. ఎన్నిక ప్రచారంలో కిషన్‌ రెడ్డి

లంచం తీసుకుంటున్న గిరిజన సంక్షేమ అధికారి జ్యోతిని పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం జ్యోతి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అధికారి నివాసంలో అధికారులు ఎక్కడికి వెళ్లినా నగదు, బంగారం దొరికాయి. ఇంత బంగారాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. సుమారు రూ.65 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. నాలుగు కేజీల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జ్యోతిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మరికాసేపట్లో కోర్టులో హాజరుపరచనుండగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఏసీబీ అధికారులు ఆమెను ఉస్మానియా తరలించి వైద్యులతో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం కుదుటపడ్డ తరువాత కోర్టులో హాజరు పరుస్తారని సమాచారం.
Mahesh Kumar Goud: దీపాదాస్ మున్షీపై ఎన్వీఎస్ఎస్ వ్యాఖ్యలు.. మహేష్ కుమార్ గౌడ్ ఫైర్