Leading News Portal in Telugu

VC Sajjanar: మేడారం వెళ్లే ప్రయాణికులకు విజ్ఞప్తి.. సజ్జనార్ సూచనలు



Vc Sajjanar

VC Sajjanar: తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నాం. రెండేళ్లకో సారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగానే ఈ 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడపుతోంది. జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నదున.. రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగింది.

Read also: Hyderabad ORR Accident: ఓఆర్ఆర్ కారు ప్రమాదంపై లేటెస్ట్ అప్డేట్.. 170 స్పీడ్ లో కారు

దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనుసుతో సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. జాతర పూర్తయ్యేవరకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని వారిని కోరుతున్నాను. తెలంగాణకే తలమానికమైన ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక మేడారం మహా జాతరలో 15 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, వారికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. జాతర విధులు నిర్వహిస్తున్న బస్సు డ్రైవర్లు జీరో ఫెయిల్యూర్స్‌తో ప్రమాదరహిత జాతరకు కృషి చేయాలని సూచించారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల సేవాభావంతో విధులు నిర్వహించాలన్నారు. సంస్థకు మంచి పేరు తీసుకురావడానికి సిబ్బంది కృషి చేయాలి. మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రయాణ పరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జాతర మార్గంలో విధులు కేటాయించిన చోటే సిబ్బంది విధులు నిర్వహించాలని సూచించారు.
Local Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. మూడు రోజుల పాటు లోకల్ హాలీడేస్..