Leading News Portal in Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?



Whatstoday

1. నేడు విశాఖకు సీఎం జగన్‌. శ్రీశారదా పీఠం సందర్శన, రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సీఎం జగన్‌. దాదాపు రెండు గంటలు శారదా పీఠంలో ఉండనున్న సీఎం జగన్‌.

2. నేడు భీమవరంలో పవన్‌ కళ్యాణ్‌ పర్యటన. ఉదయం మంగళగిరి నుంచి హెలికాప్టర్‌లో రానున్న పవన్. మొదట తోట సీతారామలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలవనున్న పవన్‌. అనంతరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో సమావేశం. తర్వాత పలు నియోజకవర్గాల జనసేన-టీడీపీ కీలక నేతలతో సమావేశం.

3. నేడు హైదరాబాద్‌లో రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం. లోకసభ ఎన్నికల నేపథ్యంలో భేటీ.

4. తెలంగాణలో రెండో రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర. నారాయణపేట, మహబూబ్‌నగర్‌లో రోడ్‌ షోల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.

5. విశాఖలో మిలాన్‌-2024 వేడుకలు. సాగరతీరంలో నావికాదళ విన్యాసాలు. హాజరుకానున్న ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్.

6. నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన. దాదాపు 70 అభివృద్ధి పనులకు శ్రీకారం. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్న రేవంత్. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తర్వాత తొలిసారి కొడంగల్‌లో పర్యటించనున్న రేవంత్‌ రెడ్డి. భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు.

7. నేడు రెండో రోజు సమతాకుంభ్‌-2024. ముచ్చింతల్‌లో మార్చి 1 వరకు జరుగనున్న ఉత్సవాలు. త్రిదండి చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో వేడుకలు.

8. నేడు మేడారం జాతరలో కీలక ఘట్టం. ఉదయం గద్దెలపైకి పగిడిద్దరాజు, గోవిందరాజు. మధ్యాహ్నం కన్నెపల్లి నుంచి గద్దెపైకి సారలమ్మ. మేడారం జాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా. సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు. మేడారం జాతరకు 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు.

9. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,560 లుగా ఉండగా. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.77 వేలుగా ఉంది.

10. నేటి నుంచి హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్‌ నిబంధనలు. భారీ వాహనాలపై హైదరాబాద్‌ పోలీసుల ఆంక్షలు. రాత్రి 10 నుంచి ఉదయం 8 వరకు ప్రైవేట్ బస్సులకు అనుమతి. లోకల్‌ లారీలకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతి. నేషనల్‌ పర్మిట్‌ ఉన్న భారీ వాహనాలకు సిటీలోకి అనుమతి లేదన్న పోలీసులు.

11. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు ఇవాళ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో నేటి ఉదయం 11 గంటలకు పాదయాత్ర చేస్తామని రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉదయం 11 గంటలలోపు స్పందించాలని లేదంటే ఢిల్లీకి బయలుదేరుతామని రైతు సంఘాల నేతలు చెప్పుకొచ్చారు.

 

11