Leading News Portal in Telugu

T.BJP: తెలంగాణలో రెండో రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర



Bjp Ratha Yatra

తెలంగాణలో నేడు రెండో రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్రలు కొనసాగనున్నాయి. నారాయణపేట, మహబూబ్‌నగర్‌లో రోడ్‌ షోల్లో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పాల్గొననున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి పాల్గొంటారు. నారాయణపేట పట్టణం శాసన్ పల్లి రోడ్, లక్ష్మీ ఫంక్షన్ హల్ లో ఉదయం 9గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ధన్వాడలో రోడ్​ షో, స్థానిక మహిళలతో కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. దేవరకద్ర, లాల్​ కోట క్రాస్​ రోడ్స్​ మీదుగా యాత్ర కొనసాగుతుంది. తర్వాత కొత్త కోట నేత కార్మికులతో, కురుమ సంఘం నేతలతో కిషన్ రెడ్డి ముచ్చటించనున్నారు.

 
Dadasaheb Phalke Awards 2024: ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్.. ఉత్తమ నటిగా నయనతార!
 

మహబూబ్​ నగర్​ పట్టణంలో రోడ్​ షో, మీడియా సమావేశం లో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. అలాగే.. యాదాద్రి జిల్లాలో భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. యాదాద్రి జిల్లాలో విజయ సంకల్ప యాత్రలో ఈటల రాజేందర్ పాల్గొంటారు. యాదాద్రి, ఆలేరు, తుంగతుర్తి మీదుగా యాత్ర సాగనుంది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రాజరాజేశ్వరీ విజయ సంకల్ప యాత్రలో ఎంపీ డా.లక్ష్మణ్ పాల్గొననున్నారు. వికారాబాద్, నర్కల్ , పరిగి, పూడురు, మన్నెగూడ, ఆలూరు మండలాల మీదుగా కొనసాగి చేవెళ్ల వరకు యాత్ర సాగనుంది. అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో కొమరం భీం విజయ సంకల్ప యాత్రలో ఎంపీ బండి సంజయ్ పాల్గొననున్నారు. నిర్మల్ జిల్లాలోని వెయ్యి ఊడల మర్రిని బండి సంజయ్ సందర్శించనున్నారు.