Leading News Portal in Telugu

CM Revanth Reddy : నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన



Cm Revanth Reddy

ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. కొడంగల్ లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకూ శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. నియోజకవర్గంలో మొత్తం రూ.4369.143 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ సాయంత్రం హెలికాఫ్టర్ లో కోస్గి చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి.. కోస్గి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మైదానంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

 

అనంతరం స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించనున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి అనంతరం వారికి బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్‌. సాయంత్రం 5గంటలకు కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. అయితే.. 2009లో తొలిసారి కొడంగ‌ల్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ పథకం సాధనకు రేవంత్‌ ఎంతో ప్రయత్నించారు. ఆయ‌న పోరాటంతో 2014లోనే ఈ ప‌థ‌కం అమ‌లు చేయాల‌ని అప్పటి ఉమ్మడి రాష్ట్ర గ‌వ‌ర్నర్‌ జీవో కూడా జారీ చేశారు. రూ.2945.50 కోట్లు ఖర్చయ్యే ఈ పథకానికి ప‌రిపాల‌న ప‌ర‌మైన అనుమ‌తులు ఇస్తూ తెలంగాణ సర్కార్‌, ఈ నెల 8న జీవో జారీ చేసింది.

AP Inter Hall Tickets: నేటి నుంచి ఇంటర్ హాల్‌టికెట్ల జారీ.. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు