Leading News Portal in Telugu

Nagendra Babu: అనుభవం, సమర్ధత లేకుండా బటన్ నొక్కితే నాశనం తప్పదంటూ నాగబాబు ట్వీట్



Nagababu

సీఎం జగన్ చేస్తోన్న బటన్ కామెంట్లపై జనసేన నేత నాగబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. అనుభవం, సమర్ధత లేకుండా బటన్ నొక్కితే నాశనం తప్పదంటూ ఓ పిట్ట కథను ఆయన ట్వీట్ చేశారు. జగనుకు రెండోసారి అవకాశమిస్తే రాష్ట్రం సర్వనాశనం అనే అర్థం వచ్చేలా ఆయన పేర్కొన్నారు.

Read Also: Kavya Thapar: అబ్బా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు ఏమైపోతారు..

ఈరోజు మీతో ఒక పిట్ట కథ పంచుకోవాలనిపించింది అని నాగబాబు ట్వీట్ లో తెలిపారు. ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు.. అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్లో, ‘విమానం నడపడం ఎలా?’ అన్న పుస్తకం కనపడింది.. అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు.. మొదటి పేజీలో ‘విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి’ అని ఉంది.. అతడు అది నొక్కాడు.. విమానం ఇంజన్ స్టార్ట్ అయింది.. అతడికి ఆసక్తి పెరిగింది.. రెండో పేజీ తిప్పాడు.. విమానం కదలాలంటే ‘పచ్చ బటన్ నొక్కండి’ అని ఉంది.. అతడు నొక్కి చూసాడు.. విమానం కదిలింది.. అతడు మరింత ఆసక్తిగా మూడో పేజీ తెరిచాడు.. విమానం వేగం అందుకోవాలంటే నీలం బటన్ నొక్కండి’ అని ఉంది.. అతడు నీలం బటన్ నొక్కాడు.. విమానం వేగం అందుకుంది.. అతడు మరింత ఉత్సాహంగా నాలుగో పేజీ తిప్పాడు.. విమానం గాలిలోకి ఎగరాలంటే ఆరెంజ్ బటన్ నొక్కండి’ అని ఉంది.. అతడు ఆరంజ్ బటన్ నొక్కాడు.. విమానం గాల్లోకి లేచింది.. యమా వేగంగా గాల్లో తేలుకుంటూ పోతున్న విమానంలో ఉన్న అతను ఐదో పేజీ తిప్పాడు.. విమానం కిందకు దిగాలంటే ‘ఈ పుస్తకం 2వ వాల్యూమ్ ‘ కొనండి’ అని ఉంది.. ఇందులో నీతి ఏంటంటే విమానం అయినా.. అధికారం అయినా.. ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే.. సర్వ నాశనం కాక తప్పదు.. అలాగే, నడపడం అంటే బటన్ నొక్కడమే కాదు.. సమర్ధత అనుభవం కూడా ఉండాలి అని నాగాబాబు పేర్కొన్నారు.