Leading News Portal in Telugu

Farmers Protests: ఢిల్లీ సరిహద్దులో టెన్షన్ టెన్షన్.. మరోసారి రైతు నేతలను చర్చలకు పిలిచిన కేంద్రం..



Delhi

ఢిల్లీలో రైతుల ఆందోళన మళ్ళీ ప్రారంభం కావడంతో శంభు సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. సరిహద్దుల దగ్గర మోహరించిన వేలాది మంది రైతులు ఇవాళ ఉదయం ఒక్కసారిగా ముందుకు కదలడంతో వారిని ఆపేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో రైతులు భారీ ఎత్తున పొక్లెయినర్లు, బుల్ డోజర్లు, జేసీబీలతో ముందుకు సాగుతున్నారు. శంభు, ఖనౌరీ సరిహద్దుల దగ్గర 14వేల మంది రైతులు 1200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సుల్లో వేచి ఉన్నారు. వీరిని అడ్డుకునేందుకు హర్యానా ప్రభుత్వం వేలాది మంది పోలీసులను రంగంలోకి దించింది.

Read Also: Uttar Pradesh : పోలీస్ రిక్రూట్ మెంట్ కోసం అప్లై చేసిని సన్నీ లియోన్ ఎవరో తెలిసిందోచ్ ?

కాగా, కేంద్ర మంత్రులతో రైతు నేతలు చర్చలు జరిపి, తమ ఆందోళనకు రెండు రోజులు విరామం ప్రకటించిన నేపథ్యంలో రైతులు పంజాబ్- హర్యానా జాతీయ రహదారిపై శంభు, ఖానౌరీ సరిహద్దుల దగ్గర వేల సంఖ్యలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంతో జరగిన నాలుగో దఫా చర్చలు విఫలమయ్యాయనీ, తమ ఆందోళన కొనసాగుతుందనీ సోమవారమే రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఇక, తాము శాంతియుతంగా ఢిల్లీలోకి ప్రవేశించాలని భావిస్తున్నామనీ, తమను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి.. తాము ముందుకు సాగుతామని రైతులు వెల్లడించారు. దీంతో రైతులకు బుల్ డోజర్లు, పొక్లెయినర్లను ఇవ్వకూడదని.. అలా ఇచ్చినవారిపై క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు.

Read Also: Kalki 2898 AD : ‘కల్కి’ డబ్బింగ్ పనులను మొదలెట్టిసిన టీమ్..

అయితే, మరోవైపు రైతులతో మరోసారి చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ప్రకటించారు. నాలుగోదఫా చర్చల తర్వాత ఎంఎస్‌పీ డిమాండ్, పంటల వైవిధ్యం, పొట్టేళ్ల సమస్య, ఎఫ్‌ఐఆర్ లాంటి అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రైతు నేతలను మరోసారి చర్చకు ఆహ్వానిస్తున్నట్లు చెబుతూ శాంతిని కాపాడుకోవడం మనకు ముఖ్యమని ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా వెల్లడించారు.