Leading News Portal in Telugu

Posani Krishna Murali: నేను అడిగిన ప్రశ్నలకు అన్ని ఆన్సర్స్ చెప్తే జీవిత కాలం మీరే సీఎం..



Posani

హెరిటేజ్ మీది కాదు.. మోహన్ బాబుది అని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి అన్నారు. జైలులో ఉండి కూడా మా ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారని భువనేశ్వరి అంటున్నారు.. ఆరు నెలల్లో మోహన్ బాబు హెరిటేజ్ చంద్రబాబుకు వచ్చేసింది.. నార్కో టెస్ట్ పెడుతా మీకు నేను ప్రశ్నలు అడుగుతా అని ఆయన పేర్కొన్నారు. నిజాలు చెబితే కమ్మ ఓట్లన్నీ మీకే పాడుతాయి.. నేను అడిగిన ప్రశ్నలకు అన్ని సమాధానాలు చెబితే జీవిత కాలం మీరే ముఖ్యమంత్రి.. జగన్ ని ఓడిద్దాం అని చెప్పుకొచ్చారు. జయప్రదను మహిళా అధ్యక్షురాలిని చేశారు.. జయప్రదను ఏ విధంగా అవమానించారు అనేది అందరికి తెలుసు.. హైకోర్ట్ జడ్జి ప్రభ శంకర్ మిశ్ర నుంచి ఎలాంటి సేవలు పొందారో తెలుసు అని పోసాని కృష్ణ మురళి తెలిపారు.

Read Also: Niti Aayog : బంజరు ప్రాంతాలలో పచ్చదనం… ఇస్రో, నీతి ఆయోగ్ సంయుక్త ప్రణాళిక

వంగవీటి కాపు లెజెండ్ వంగవీటి మోహనరంగను చంద్రబాబే చంపించాడని పబ్లిక్ డొమైన్ లో ఉంది అని పోసాని కృష్ణ మురళి ఆరోపించారు. కాపులు రౌడీలు అని చిరంజీవిది కాపుల పార్టీ అని గతంలో ఆయన అవమానించారు.. రామరావు పార్టీ పెట్టినప్పుడు మీరు పార్టీలో కార్యకర్త కూడా కాదు.. అన్ని పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి.. సీఎం అవ్వడానికి ప్రపంచంలో లేని పథకాలు పెడుతున్నారు అని పోసాని మండిపడ్డారు. ఎన్టీ రామారావు పెట్టిన మంచి పథకాలను మీరు సీఎం అయ్యాక నాశనం చేశారు.. రామారావు పథకాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నాయా?.. వీటన్నింటి మీద నార్కో టెస్ట్ పెట్టుకుందాం.. అన్నిట్లో పాస్ అవుతే 175 సీట్లు మీకు వచ్చేస్తాయి.. మీతో ఛాలెంజ్ కి నేను చాలు.. హానెస్ట్ గా ఉండే కమ్యూనిస్టులు ఇప్పుడు మీతో ఎలా కలుస్తున్నారు.. నార్కో టెస్టులో మగసీతలాగా బయటకు వస్తే.. కమ్మోడిగా మీ కోసం పాదయాత్ర చేస్తా.. నార్కో టెస్ట్ కు ఆర్ యూ రెడీ? ఐఎం రెడీ.? ఎనీ వేర్.? ఎనీ ప్లేస్? అంటూ పోసాని కృష్ణ మురళి సవాల్ విసిరారు.