
ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్ నిర్వహించారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీని 2, 3 టైర్ సిటీస్ గా విస్తరణ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. ఫార్మా ఇండస్ట్రీ పూర్తిగా రెడ్ జోన్.. పొల్యూషన్ ఎక్కువ కాబట్టి క్లస్టర్ లు ఏర్పాటు చేసి విభజిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఉంటుంది.. ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మరోవైపు.. నల్గొండలో డ్రై పోర్ట్ ప్రపోజల్ పెడుతున్నాం.. ఏపీ పోర్టులకు దగ్గరగా ఉంటుందని నల్గొండలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Pawan Kalyan: నువ్వు సిద్ధమంటే.. మేం యుద్ధం అంటాం..
బెంగళూరు హైవేలో ఐటీ కారిడార్ తీసుకోస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. దీనికి కర్ణాటక ప్రభుత్వంతో కూడా మాట్లాడి ముందుకు తీసుకెళ్తామన్నారు. మరోవైపు.. బయో ఆసియా…ఈ నెల 26 నుంచి 28 వరకు ఉంటుందని.. దానిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని అన్నారు. అంతేకాకుండా.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ లో ఏర్పాటు అవుతుందని చెప్పారు. మరోవైపు.. ఐటీ ఎగుమతులు 2లక్షల 50వేల కోట్లను ఐదు ఏళ్లలో డబుల్ చేస్తామన్నారు.
California: కాలిఫోర్నియాలో తుఫాన్ బీభత్సం.. ఇబ్బందుల్లో ప్రజలు
ఇదిలా ఉంటే.. వరంగల్ లో కూడా ఐటీ పార్క్ ను మరింత డెవలప్ చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జపాన్ సంస్థలు ఇండస్ట్రియల్ పార్క్ కోసం.. ఎల్ బి నగర్ వైపు 800 ఎకరాలలో ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. ఏ ఏ జిల్లాలో ఏయే కంపెనీలు పెట్టాలో ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఆర్ఆర్ఆర్ లోపల, బయట అభివృద్ధి.. కంపెనీల ఏర్పాటు పై రిపోర్ట్ కోసం ఓ సంస్థకి అప్పగించామని మంత్రి పేర్కొన్నారు.