Leading News Portal in Telugu

Shreyas Iyer-BCCI: బీసీసీఐకి అడ్డంగా దొరికిపోయిన శ్రేయాస్ అయ్యర్.. చర్యలు తప్పవా?



Shreyas Iyer

Will BCCI take action against Shreyas Iyer: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి అడ్డంగా దొరికిపోయాడు. గాయం తిరగబెట్టిందని, వెన్నునొప్పి వస్తుందని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్లిన శ్రేయాస్.. ఫిట్‌గా ఉన్నాడని తాజాగా తేలింది. శ్రేయాస్ ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐకి ఎన్‌సీఏ వైద్య బృందం రిపోర్ట్ ఇచ్చింది. మ్యాచ్ ఆడే సామర్థ్యంతో అతడు ఉన్నాడని బీసీసీఐకి ఎన్‌సీఏ నివేదిక పంపింది. దాంతో శ్రేయాస్‌పై విమర్శలు మొదలయ్యాయి.

వెన్నునొప్పి కారణంగా ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. రెండో టెస్టు ముగిసిన అనంతరం శ్రేయస్ ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవడానికి ఎఎన్‌సీఏకి వెళ్లాడు. తనకు గాయం తిరగబెట్టిందని, వెన్నునొప్పి వస్తుందనే కారణాలతో దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2024కి దూరమయ్యాడు. త్వరలో బరోడాతో జరిగే క్వార్టర్ ఫైనల్స్‌కు శ్రేయాస్ జట్టుకు అందుబాటులో ఉండడం లేదని ముంబై క్రికెట్ అసోషియేషన్ పేర్కొంది.

Also Read: Shanmukh Jaswanth: గంజాయితో పట్టుబడ్డ ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్.. అన్న కోసం వెళ్తే అడ్డంగా దొరికిపోయాడు!

అయితే ఎన్‌సీఏ ఇచ్చిన తాజా రిపోర్ట్.. శ్రేయస్ అయ్యర్ చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. శ్రేయస్‌కు కోతగా గాయమే లేదని, అతను ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐకి ఎన్‌సీఏ రిపోర్ట్ ఇచ్చింది. మ్యాచ్ ఆడే సామర్థ్యంతో శ్రేయస్‌ ఉన్నాడని ఎన్‌సీఏ తన వేదికలో పేర్కొంది. దీంతో శ్రేయస్ వైఖరిపై బీసీసీఐ మండిపడుతున్నట్లు తెలుస్తోంది. రంజీ ట్రోఫీలో ఆడటానికి యువ క్రికెటర్లు ఎందుకు ఆసక్తి చూపట్లేదని అందరూ ఫైర్ అవుతున్నారు. ఐపీఎల్‌ 2024ను దృష్టిలో పెట్టుకుని శ్రేయస్ ఇలా చేశాడనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా రంజీ ట్రోఫీలో ఆడని విషయం తెలిసిందే. మరి శ్రేయాస్‌పై బీసీసీఐ ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి.