Leading News Portal in Telugu

Madhya Pradesh: స్నేహితుడిని పెళ్లి చేసుకునేందుకు లింగమార్పిడి ఆపరేషన్‌.. తర్వాత ఏమైందంటే..!



Sex Operation

వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.. ఇండోర్ కు చెందిన 28 ఏళ్ల వ్యక్తికి 2021లో ఉత్తరప్రదేశ్ కు చెందిన వైభవ్ శుక్లా అనే యువకుడితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త విపరీతమైన ప్రేమగా మారింది. అయితే వైభవ్.. ఆ యువకుడిని సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేయించుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అలా అయితే సమాజంలో గౌరవంగా జీవించవచ్చని ఆ యువకుడికి చెప్పాడు. దీంతో బాధితుడు లింగమార్పిడి ఆపరేషన్‌తో స్త్రీగా మారాడు. ఇప్పటి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత వైభవ్ మాట మార్చాడు. తనను పెళ్లి చేసుకోలేనని.. నిరాకరించాడు శుక్లా. అంతేకాకుండా బాధితుడు (బాధితురాలు)తో అసహజ శృంగారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

Read Also: Kodali Nani : టీడీపీ-జనసేన-బీజేపీ ఎక్కడ యుద్దం చేస్తారో వారికే తెలియదు

దీంతో బాధితుడు విజయ్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. తన మిత్రుడు పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఫిర్యాదు చేశాడు. తన ఆపరేషన్ కోసమని లక్షల రూపాయలు ఖర్చు చేశానని, తీరా సమయానికి పెళ్ళి చేసుకోనని అంటున్నాడని పోలీసులకు తెలిపాడు. అంతేకాకుండా.. ఈ విషయాన్ని ఎవరితో చెప్పకూడదన్నాడని, చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించినట్లు తెలిపాడు. ఈ క్రమంలో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. దీంతో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. అతడి కోసం గాలిస్తున్నారు.

Read Also: Congress: బీజేపీ ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదం.. అందుకే మన సొమ్మును దోచుకుంది..