
ఆస్ట్రేలియా అడవుల్లో (Australia Wildfires) కార్చిచ్చు చెలరేగింది. మంటలు దట్టంగా వ్యాపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రంగా నివారణ చర్యలు చేపట్టింది. మరోవైపు పరిస్థితులు అదుపు తప్పడంతో ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రానికి పశ్చిమాన ఈ కార్చిచ్చు చెలరేగింది. మంటల ఉధృతి పెరగడంతో ఆస్ట్రేలియా సమీప పట్టణాలకు వ్యాప్తిస్తున్నాయి. 28 చిన్న పట్టణాలను ఖాళీ చేయాలని ప్రజలకు ప్రభుత్వాధికారులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు.
బలమైన గాలులు కారణంగా మంటలు నగరాలకు వ్యాప్తి చెందడంతో పాఠశాల విద్యార్థులను ఇతర పాఠశాలకు తరలించారు. అలాగే విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే ఖరీదైన ఆస్తులు కూడా మంటల్లో కాలిపోయే సూచనలు కనిపిస్తు్న్నాయి. ఇంకోవైపు మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగింది. దాదాపు వెయ్యి అగ్నిప్రమాక సిబ్బంది మంటలను అదుపు చేస్తు్నారు. అలాగే 24 విమానాల ద్వారా కూడా అదుపు చేస్తు్న్నారు. ఈ మంటల్లో పలు పశువులు చనిపోయినట్లుగా తెలుస్తోంది.
ప్రాంతీయ రాజధాని మెల్‌బోర్న్‌కు వాయువ్యంగా 150 కిలోమీటర్ల దూరంలో గురువారం ఉదయం ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. బలమైన గాలులు వీచడం వల్లే ఈ మంటలు వేగంగా వ్యాపిస్తు్న్నాయని అధికారులు చెబుతున్నారు. పరిస్థితులను బట్టే అధికారులు ఎమర్జెన్సీ విధించారు.
ఇదిలా ఉంటే ఈ వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విక్టోరియన్ అధికారులు ముందుగానే హెచ్చరించారు. 2019-2020లో కూడా ఆస్ట్రేలియాలో కార్చిచ్చు కారణంగా వేలాది జంతువులు సజీవ దహనం అయ్యాయి. భారీ ఎత్తున ఆస్తుల నష్టం జరిగింది.