
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన యాక్షన్ మరియు డ్యాన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు..సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడిగా సినిమాల్లోకి వచ్చి యాక్షన్ హీరోగా గుర్తింపు పొందాడు.సౌత్ ఇండియా ఇండస్ట్రీలో ఇప్పటికే టైగర్ ష్రాఫ్ మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి నటించాడు. బడే మియా చోటే మియా మూవీలో ఈ ఇద్దరూ కనిపించనున్నారు. మరి సౌత్ నుంచి ఇంకా ఎవరితో అయినా నటించాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించినప్పుడు ఈ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ ల పేర్లును చెప్పాడు.”నేను అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లకు వీరాభిమానిని. ఏదో ఒక రోజు వాళ్లతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది” అని టైగర్ ష్రాఫ్ అన్నాడు. పదేళ్ల కిందట హీరోపంతి మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ యంగ్ హీరో అప్పటి నుంచీ అతడు పూర్తి యాక్షన్ సినిమాలే చేస్తూ వస్తున్నాడు.
తన కెరీర్లో పూర్తిగా యాక్షన్ సినిమాలే చేయడానికి కూడా ఓ ప్రత్యేక కారణం ఉన్నట్లు టైగర్ ష్రాఫ్ చెప్పుకొచ్చాడు. “ఎంతో టాలెంట్, పోటీ ఉన్న ఇండస్ట్రీలో మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. నాకు యాక్షన్ హీరో అనే ట్యాగ్ రావడం ఆడియెన్స్ నాకు ఇచ్చిన గుర్తింపుగా భావిస్తాను” అని టైగర్ ష్రాఫ్ అన్నాడు. యాక్షన్ జానర్ తన జోన్ అని ఆయన స్పష్టం చేశాడు.”యాక్షన్ హీరో ట్యాగ్ ఓ గౌరవం. నేనెప్పుడూ దీని కోసమే కలగనేవాడిని. స్క్రీన్ పై నేను చూసిన హీరోల్లాగా ఎదగాలని నేను భావించే వాడిని. మొత్తానికి నా లక్ష్యాలు నెరవేరుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది” అని టైగర్ స్పష్టం చేశాడు. తన నెక్ట్స్ మూవీ బడే మియా చోటే మియాలో అక్షయ్ కుమార్ తో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని టైగర్ ష్రాఫ్ తెలిపాడు.ఈ సినిమా షూటింగ్ సమయాన్ని బాగా ఎంజాయ్ చేశాను. అక్షయ్ సర్ వల్లే అది జరిగింది. ఆయన అద్భుతమైన కోస్టార్, మెంటార్ మరియు నాకు అన్నలాంటి వాడు” అని టైగర్ ష్రాఫ్ తెలిపాడు.