
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Kejriwal) అరెస్ట్ వార్తలపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రెండ్రోజుల్లో అరెస్ట్ చేయొచ్చంటూ ఆప్ నేతలు (AAP Leaders) ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తమ దగ్గర సమాచారం ఉందంటూ ముఖ్య నాయకులు మీడియా వేదికగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీ కేసులో (Liquor Police Case) ఇప్పటికే కేజ్రీవాల్‌కు ఆరుసార్లు ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ విచారణకు హాజరుకాలేదేు. కోర్టును ఆశ్రయించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. విచారణకు హాజరుకావాలని ముఖ్యమంత్రికి న్యాయస్థానం సూచించింది. అయినా కూడా కేజ్రీవాల్ విచారణకు డుమ్మా కొట్టారు. తాజాగా ఆయనకు ఏడోసారి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ను రెండ్రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తమకు వార్తలు అందుతున్నాయని ఆప్ నేతలు చెప్పుకొస్తున్నారు.
ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు కొనసాగిస్తూ పోతున్నందునే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయొచ్చని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు వదులుకోవాలని బీజేపీ బెదిరిస్తోందని భరద్వాజ్ చెప్పుకొచ్చారు. ఈడీ వల్ల అరెస్ట్ కాలేదని.. అందుకే సీబీఐ ద్వారా కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇక ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా తాజాగా సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఆమెను నిందితురాలిగా కూడా చేర్చింది. ఈనెల 26న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. మరీ విచారణకు హాజరవుతారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు రాజకీయ ప్రముఖులను కలవొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఓ వైపు కేజ్రీవాల్ అరెస్ట్ వార్తలు.. ఇంకోవైపు కవితకు నోటీసుల అంశం.. మరోసారి దేశ వ్యాప్తంగా రాజకీయంగా హీటెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. నిందితురాలిగా కవిత
#WATCH | Delhi Minister and AAP leader Saurabh Bharadwaj says, "We have information that Delhi CM Arvind Kejriwal will be arrested in the next 2-3 days. The question is, why is the Central Government showing such haste?…Even the BJP people are telling us that if an alliance… pic.twitter.com/zej4cpv0Fi
— ANI (@ANI) February 23, 2024