Leading News Portal in Telugu

Lara Thermal Plant: నేడు లారా థర్మల్‌ ప్లాంట్‌ జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ..



Modi

Prime Minister Narendra Modi: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో నిర్మితమైన ఎన్‌టీపీసీకి చెందిన 1,600 మెగావాట్ల లారా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (శనివారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేస్తారు. అలాగే, రెండవ దశలో మరో 1,600 మెగావాట్ల ప్లాంట్‌కు మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

Read Also: Goa : గోవాలో ఆరేళ్ల బాలికపై దారుణం.. నిందితులు దేశం నుంచి పరార్

అయితే, మొదటి దశ స్టేషన్‌ను దాదాపు 15,800 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. రెండో దశ ప్రాజెక్టుకు మరో 15,530 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాజెక్ట్ కోసం బొగ్గు ఎన్‌టీపీసీకి చెందిన తలైపల్లి బొగ్గు బ్లాక్ నుంచి మెర్రీ-గో-రౌండ్ (ఎంజీఆర్‌) వ్యవస్థ ద్వారా సరఫరా అవుతుందని చెప్పారు. తద్వారా దేశంలో తక్కువ ధరలకే విద్యుత్ సరఫరా అవుతుందని పేర్కొంది.

Read Also: Ambajipeta Marriage Band OTT: ఓటీటీలో అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కాగా, అదే విధంగా ఛత్తీస్‌గఢ్‌లో 600 కోట్ల రూపాయల విలువైన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) మూడు ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులను కూడా వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అలాగే ఆదివారం(ఫిబ్రవరి 25) గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో తొలి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Aiims) సహా ఐదు ఎయిమ్స్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. వీటిలో మంగళగిరి (ఏపీ), భటిండా (పంజాబ్), రాయ్ బరేలీ (ఉత్తరప్రదేశ్), కళ్యాణి (పశ్చిమ బెంగాల్)లలో కొత్తగా నిర్మించిన ఎయిమ్స్‌లను ప్రారంభించనున్నారు.