Leading News Portal in Telugu

CM Revanth Reddy: నేడు ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సమావేశం



Cm Revanth Reddy

CM Revanth Reddy: ధరణి పోర్టల్ పునర్నిర్మాణం, సమస్యలపై అధ్యయనం చేసే కమిటీతో ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ కానున్నారు. ధరణి సమస్యలను పరిష్కరించి మాతృభూమిగా మారుస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. ముందుగా సమస్యలపై అధ్యయనం చేసేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ కన్వీనర్‌గా కిసాన్ కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది సునీల్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్‌లతో ప్రభుత్వం కమిటీని వేసింది. ధరణి కమిటీ ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, కొందరు కలెక్టర్లతో సమావేశమైంది. ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, పరిష్కార మార్గాలను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి కమిటీ వివరించనుంది. వారి సూచనల మేరకు ప్రభుత్వం త్వరలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Read also: TTD EO Dharmareddy: తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం

రాష్ట్రంలో భూసమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ పై ప్రత్యేక కమిటీని వేసిన సంగతి తెలిసిందే. భూమాత స్థానంలో ధరణిని బరిలోకి దించనున్నట్లు హస్తం పార్టీ ప్రకటించింది. ఇందులో భాగంగా పోర్టల్‌లో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం దానిని పునర్నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని భూ సమస్యలు, పరిష్కారాలపై పలువురు కలెక్టర్లు, అధికారులతో ధరణి కమిటీ సమావేశాలు నిర్వహించింది. అందులో చాలా లోపాలను గుర్తించింది. ధరణిలో ఒక సమస్యకు మరో సమస్యకు ముడిపెట్టలేదన్నారు. పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి అనేక లోపాలున్నాయని పేర్కొంది. తెలంగాణలో భూసమస్యల పరిష్కారానికి ధరణి సాఫ్ట్‌వేర్‌ను మార్చితే సరిపోదని, చట్టాలను కూడా మార్చాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని కమిటీ ప్రాథమికంగా వ్యక్తం చేసింది.

Read also: TTD EO Dharmareddy: తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం

ధరణి పోర్టల్ నిర్వహణ సంస్థ అయిన టెరాసిస్ ప్రతినిధులతోనూ కమిటీ చర్చించింది. ధరణి సాఫ్ట్‌వేర్‌తో మాడ్యూల్స్ ఎలా పని చేస్తాయి? అప్లికేషన్ నుండి పరిష్కారం వరకు సాఫ్ట్‌వేర్ ఏ దశల్లో ఎలా పని చేస్తుంది? ఎదురవుతున్న సమస్యలను లోతుగా అడిగి తెలుసుకున్నారు. సాఫ్ట్‌వేర్‌లో మరిన్ని మాడ్యూల్స్ అవసరమని తెలుస్తోంది, అదేవిధంగా అప్లికేషన్ నుండి పరిష్కారం వరకు ప్రతిదీ ఆన్‌లైన్‌లో ఉండాలి. ధరణి విధానం వల్ల సామాన్యులకు ప్రయోజనం లేదని కమిటీ పేర్కొంది. 35 మాడ్యూల్స్ ప్రజలకు ఉపయోగపడవని తేల్చింది. నిషేధిత జాబితాలో 18 లక్షల ఎకరాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తుండగా, పార్ట్-బీలో 23 లక్షల ఎకరాలు ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా, పోర్టల్‌లోని ఎంపికలలో కీలకమైన మార్పులను సూచించింది. భూ సమస్యలన్నింటికీ ఒకే దరఖాస్తు ఉండాలని వివరించింది. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు రెవెన్యూ శాఖకు ప్రాథమికంగా సూచించినట్లు తెలిసింది.
Group2 Exam: రేపు గ్రూప్‌-2 పరీక్ష.. అభ్యర్థులు ఇబ్బంది పడకుండా వసతులు