Leading News Portal in Telugu

Fuel prices: త్వరలో పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం.. హింట్ ఇచ్చిన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి..



Hardeep Singh Puri

Fuel prices: పెట్రోల్-డిజిల్ ధరలతో అల్లాడుతున్న సామాన్యుడికి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. దేశీయంగా ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి హింట్ ఇచ్చారు. నాలుగో త్రైమాసికింలో చమురు మార్కెటింగ్ కంపెనీలు లాభాల్లోకి వస్తే దేశంలో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని శుక్రవారం ఆయన చెప్పారు. యుఎన్ గ్లోబల్ కాంపాక్ట్ నెట్‌వర్క్ ఇండియా (యుఎన్‌జిసిఎన్‌ఐ) 18వ జాతీయ సదస్సు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒఎంసిలు గత నష్టాల నుంచి కోలుకున్నాయని, రానున్న త్రైమాసికంలో లాభాలను చూడవచ్చని పేర్కొన్నారు. నాలుగో త్రైమాసికం బాగుంటే ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు ఆశిస్తున్నానని చెప్పారు.

Read Also: Deloitte Analysis: హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు భారతీయుల ప్రాధాన్యం.. ఆటోమొబైల్ సర్వేలో కీలక విషయాలు..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), మరియు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు మూడు త్రైమాసికాల్లో నిలకడగా లాభాలు నమోదు చేశాయని, ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోనే ఏకంగా రూ. రూ.11,773.83 కోట్ల లాభాన్ని నమోదు చేశాయి. గత మూడు త్రైమాసికాల్లో వారి ఉమ్మడి లాభాలు రూ. 69,000 కోట్లుగా ఉన్నాయి. ఇన్‌పుట్ ఖర్చులు ఎక్కువగా ఉన్న సమయంలో సంస్థలు నష్టాలు చవిచూడగా.. ముడి చమురు ధరలు తక్కువగా ఉన్న సమయంలో లాభాలను ఆర్జించాయి. మే 22, 2022 నుంచి దేశంలో పెట్రోల్, డిజిల్ ధరలు మారలేదు.