
రాంచీలో జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆట ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ 24, జైస్వాల్ 16 పరుగులతో ఉన్నారు. కాగా.. ఇంకా భారత్ విజయానికి 152 పరుగులు కావాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 145 పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్పిన్లర్లు దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
Read Also: Teegala Krishna Reddy: బీఆర్ఎస్కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా..
భారత్ బౌలింగ్ లో అశ్విన్ 51 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ కూడా 22 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు, జడేజా ఒక వికెట్ సంపాదించాడు. ఇక.. ఇంగ్లండ్ బ్యాటర్లలో క్రాలే 60 పరుగులు, బెయిర్ స్టో 30 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఫోక్స్ (17), డకెట్ (15), రూట్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్ 0, స్టోక్స్ 4, హార్ట్లీ 7, రాబిన్సన్ 0, ఆండర్సన్ 0 పరుగులకే ఔటయ్యారు.
Read Also: IND vs ENG: ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చిన భారత్.. ఇండియా టార్గెట్ ఎంతంటే.. ?
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 353 పరుగులు చేసింది. రూట్ (122) అజేయ సెంచరీ చేయడంతో ఆ జట్టుకు కీలక పరుగులు లభించాయి. రాబిన్సన్ (58), జాక్ క్రాలే (42), బెయిర్‌స్టో (38), ఫోక్స్ (47) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా.. ఇప్పటికే భారత్ రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో విజయం సాధించగా, ఇంగ్లాండ్ ఒక్క టెస్ట్ మ్యాచ్ గెలిచింది. కాగా.. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని ఆత్రుతగా ఉంది భారత్.