
Chinmayi: సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గాత్రంతో సంగీత అభిమానులను ఎంతగా అలరించిందో.. ఆడవాళ్లకు ఏదైనా ఆపద వచ్చిందంటే సోషల్ మీడియాలో అమాంతం ప్రత్యక్షమయ్యి అండగా నిలుస్తుంది. ఆడవారిని హింసించడం, వేధించడం లాంటివి చేస్తే.. వారిని తనదైన రీతిలో ఏకిపారేస్తుంది. తాజాగా మరోసారి ఆమె అలాంటి ఒక ఘటనపై ఫైర్ అయ్యింది. అయితే ఈసారి ఆడవారిని అగౌర పరుస్తూ మాట్లాడింది సీనియర్ నటి అన్నపూర్ణమ్మ కావడం విశేషం. అన్నపూర్ణ ప్రస్తుతం బామ్మ పాత్రల్లో నటిస్తూ బిజీగా మారింది. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆమె.. ఆడవారి గురించి, వారిపై జరిగే అత్యాచారాల గురించి మాట్లాడింది. ” ‘అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా? ఆడదానికి ఎందుకు స్వాతంత్య్రం కావాలి? రాత్రి 12 గంటల తర్వాత ఏం పని? ఇప్పుడు ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయింది. ఎవరూ మనల్ని ఏమీ అనొద్దు అనుకున్నా.. అందరూ మనల్ని ఏదో ఒకటి అనేట్లుగానే రెడీ అవుతున్నాం. ఎప్పుడూ ఎదుటివాళ్లది తప్పు అనకూడదు. మనవైపు కూడా కొంచెం ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఈ వీడియో పై చిన్మయి ఫైర్ అయ్యింది. తనకు నచ్చిన ఒక నటి ఇలా మాట్లాడడం గుండె పగిలినట్లుగా అనిపిస్తుందని తెలిపింది. ఆమె చెప్పినట్లుగా ఉంటే అర్ధరాత్రి ఎలాంటి హాస్పిటల్స్, డాక్టర్స్ ఉండరని, వాళ్ళందరూ అమ్మాయిలు కాబట్టి అర్ధరాత్రి ఇంట్లోనే ఉంటారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, యాక్సిడెంట్ అయినా సూర్యోదయం, సూర్యాస్తమయానికి మధ్యలోనే జరగాలని, అర్ధరాత్రి జరిగితే.. అమ్మాయిలను ఇంట్లోనే ఉంచాలని చెప్పుకొచ్చింది. అన్నపూర్ణ గారు చెప్పినట్లు చేస్తే.. పిల్లలు కూడా అర్ధరాత్రి పుట్టకూడదు అని, గైనకాలజిస్టులు ఉండరు, ఉండకూడదు కాబట్టి అని తెలిపింది.ఇంట్లో వాష్రూమ్స్ లేక సూర్యోదయానికి ముందు పొద్దున్నే 3 గంటలకు లేచి పొలం గట్టుకు వెళ్తున్న ఆడవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారని, అమ్మాయిల వేషధారణ వలనే అత్యాచారాలు జరుగుతున్నాయని అనుకునే ఇలాంటివారు బతుకుతున్న ఇండియాలో ఆడపిల్లలుగా పుట్టడం మన కర్మ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
View this post on Instagram