Leading News Portal in Telugu

Israel-Hamas War: గాజాలో ఆకలి కేకలు.. కలుపు మొక్కలు, పశుగ్రాసమే ఆహారం..



Gaza War

Israel-Hamas War: ఇజ్రాయిల్ హమాస్ మిలిటెంట్ల దాడి సాధారణ పాలస్తీనియన్లను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసింది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని దారుణంగా చంపేసింది. మరికొందరిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇప్పటివరకు మరణాల సంఖ్య 30,000లను దాటింది. ఇదిలా ఉంటే ఇప్పుడు గాజాలోని ప్రజలు ఆకలితో దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఆహారం, మందులు లేక విలవిల్లాడుతున్నారు. ఉత్తర గాజా నుంచి వేల మంది పాలస్తీనియన్లు పారిపోతున్నారు.

Read Also: Point Nemo: భూమిపై అత్యంత మారుమూల ప్రాంతం..అంతరిక్ష శ్మశానవాటికగా పేరు.. దీని విశేషాలు ఇవే..

దక్షిణంగా ఈజిప్టు వైపుగా ప్రజలు ఆహారాన్ని వెతుక్కుంటూ వలస వెళ్తున్నారు. అక్కడ దుర్భరమైన ఆకలి కేకలు వినిపిస్తున్నాయని, ఆ పరిస్థితులను వర్ణించలేనివిగా ఉన్నాయని గాజా ప్రజలు చెబుతున్నారు. పాలు లేకుండా, పశుగ్రాసంతో తయారు చేసిన రొట్టెలను పిల్లలకు పెడుతుండటం అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపెడుతోంది. తినడానికి తిండి లేకపోవడంతో స్థానికంగా పెరిగే మాలో అనే మొక్కలను ఆహారంగా తీసుకుంటున్నారు.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉత్తర గాజాను టార్గెట్ చేసింది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడుతోంది. దీంతో లక్షలాది మంది దక్షిణం రఫా బోర్డర్ వైపు వెళ్తున్నారు. గాజాలో 28 లక్షల మందిలో 80 శాతం మంది ఇప్పటికే దక్షిణ ప్రాంతాలకు వెళ్లిపోయారు. భీకర దాడుల్లో ఆహారం, మందులు వంటి మానవతా సాయాన్ని తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యూఎన్ ఫుడ్ ప్రోగ్రాం కూడా నిరాశ స్థాయికి చేరడంతో సంక్షోభం మరింత ముదిరింది. మానవతా సాయం నిలిచిపోవడంతో అక్కడి ప్రజల పరిస్థితులు ఘోరంగా మారాయి. కొంతమంది నివాసితులు కుళ్లిన మొక్కజొన్న, పశుగ్రాసం, గుర్రాల మాంసం, చెట్ల ఆకుల్ని కూడా తింటున్నారు.