Leading News Portal in Telugu

Massive Road Accident: కాకినాడ హైవేపై ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి



Road Accident

Massive Road Accident: కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు.. ప్రత్తిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాదాలమ్మ గుడి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.. పంక్చర్‌ అయిన లారీ టైర్‌ను నలుగురు వ్యక్తులు మారుస్తుండగా.. ఈ క్రమంలో అతి వేగంతో దూసుకొచ్చిన ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు.. ఆ టైర్‌ మారుస్తున్నవారిని ఢీకొట్టింది.. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.. మృతులను దాసరి ప్రసాద్‌, దాసరి కిషర్‌, క్లీనర్‌ నాగయ్య, స్థానికుడు రాజుగా గుర్తించారు.. మృతుల్లో ముగ్గురు బాపట్ల జిల్లా నక్క బొక్కలపాలెంకు చెందినవారు కాగా.. రాజు అనే యువకుడిది ప్రత్తిపాడుగా గుర్తించారు. ఇక, సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.