Leading News Portal in Telugu

NITI Aayog: భారత్ లో తగ్గిన పేదరికం.. నీతి అయోగ్‌ సర్వేలో కీలక విషయాలు..!



Niti Ayoge

India’s Poverty level: భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పలు కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయని నీతి అయోగ్‌ తెలిపింది. అది జరిపిన తాజా సర్వేలో భారత్‌లో దాదాపు 5 శాతం మేర పేదరికం తగ్గిందని నీతి అయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఆయన దీన్ని తాజ గృహ వినియోగ డేటా సర్వేను కీలకంగా చేసుకుని దీన్ని అంచనా వేసినట్లు చెప్పుకొచ్చారు. తాము ఆగస్టు 2022 నుంచి జులై 2023ల మధ్య జరిపిన గృహ వినియోగ సర్వే ఆధారంగా దీన్ని వెల్లడించినట్లు చెప్పారు. ఆయా సంవత్సరాల మధ్య జరిగిన గృహ వినియోగ సర్వేల ఆధారంగా.. గ్రామీణ , పట్టణ ప్రాంతాల మధ్య 2.5 శాతం పెరుగుదల కనిపించిందన్నారు. పట్టణ గృహాల్లో సగటు నెలవారీ తలసరి వినియోగ వ్యయం 2011-12 నుంచి 3.5 శాతం మేర పెరిగి రూ. 3,510కి చేరుకుందన్నారు.

Read Also: Divi Vadthya: బీటెక్ లోనే ప్రేమ.. అతడు నా కళ్ళముందే చనిపోయాడు

అయితే, గ్రామీణ భారతదేశం గణనీయంగా 40.42 శాతం పెరుగుదలలో రూ. 2,008కి చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ డేటా ఆధరాంగా దేశంలో పేదరికం 5 శాతం లేదా అంతకంటే తగ్గే ఛాన్స్ ఉందని నీతి అయోగ్ సీఈఓ బీవీఆర్‌ సుబ్రమణ్యం తెలిపారు. ఈ సర్వే ఆహారంపై పెడుతున్న ఖర్చు విధానాల్లో మార్పులను కూడా గుర్తించింది అని వెల్లడించారు. గ్రామీణ కుటుంబాలు మొత్తం వ్యయంలో 50 శాతం శాతం కంటే తక్కువ ఆహారం కోసం కేటాయించినట్లు సర్వేలో తేలింది. అలాగే, పట్టణ- గ్రామీణ వినియోగ విభజన 2004-05లో 91 శాతం నుంచి 2022-23 నాటికి 71 శాతం తగ్గిందని నీతి అయోగ్ పేర్కొనింది.

Read Also: Mohan Babu: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు.. మోహన్ బాబు సంచలన లేఖ!

ఇక, ఆహారంలో పానీయాలు, ప్రాసెస్‌ చేసిన ఆహారం, పాలు, పండ్ల వినయోగం పెరుగుతోందని నీతి అయోగ్ చేసిన సర్వేలో వెల్లడించింది. ఈ సర్వే ఒక వైవిధ్యమైన సమతుల్య వినియోగ సూచన ఇచ్చిందిన బీవీఆర్‌ సుబ్రహ్మణ్య అన్నారు. దేశంలోని పేదరిక నిర్మూలను హైలెట్‌ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పలు పథకాలు పతాక స్థాయిలో విజయం సాధించడంతో ఇది సాధ్యం అయిందన్నారు. అలాగే, ఈ సర్వేలో పేదరికం దాదాపు అదృశ్యమవుతుందని చెబుతోంది. ఇది నిజంగా శుభపరిణామాం కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితులను తట్టుకుని మంచి పురోగతి దిశగా భారతదేశం అడుగులు వేస్తుందని నీతి అయోగ్ చెప్పుకొచ్చింది.