Leading News Portal in Telugu

Pakistan: చరిత్ర సృష్టించిన నవాజ్ షరీఫ్ డాటర్



History

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పీఎంఎల్-ఎన్ సీనియర్ నాయకురాలు మరియం నవాజ్ (Maryam Nawaz ) సరికొత్త చరిత్ర సృష్టించారు. సోమవారం ఆమె పంజాబ్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా (Punjabs First Female Chief Minister) ఎన్నికై సరికొత్త రికార్డ్ నెలకొల్పారు.

ఈ సందర్భంగా మరియం మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఎంపిక కావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ముందుగా దేవునికి, తన తండ్రి షరీఫ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఓటు వేసిన శాసనసభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.

తన తండ్రి కూర్చునే సీట్లో కూర్చోవడం ఆనందంగా ఉందని మరియం తెలిపింది. ఈ పదవి ఎలా నిర్వహించాలో తన తండ్రి తర్ఫీదు ఇచ్చారని పేర్కొన్నారు. తాను మహిళా ముఖ్యమంత్రిగా ఎంపిక కావడంతో ప్రతి మహిళా గర్వపడుతున్నారని.. భవిష్యత్‌లో కూడా మహిళా నాయకత్వ సంప్రదాయం కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. తాను జైలు శిక్ష లాంటి కష్ట సమయాలను చూశానని.. తనను బలంగా చేసిన ప్రత్యకర్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే తాను ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడనని స్పష్టం చేశారు.

 

ఇదిలా ఉంటే శాసనసభలో మరియంకు సంపూర్ణ మద్దతు లభించింది. పీఎంఎల్-ఎన్.. మిత్రపక్షాలతో మరియం మెజార్టీ సాధించింది.