Leading News Portal in Telugu

Imran Khan: తన లాయర్లను ఒంటరిగా కలిసేందుకు ఇమ్రాన్‌ ఖాన్‌కు కోర్టు అనుమతి



Imran Khan

Imran Khan: పీటీఐ వ్యవస్థాపకుడు, పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ తన లాయర్లను జైలులోనే ఒంటరిగా కలిసేందుకు ఇస్లామాబాద్‌ హైకోర్టు అనుమతి ఇచ్చింది. జైలు హ్యాండ్‌బుక్ ప్రకారం.. ఇమ్రాన్‌ఖాన్‌ను ఒంటరిగా కలిసేందుకు న్యాయవాదులను అనుమతించాలని జైలు నిర్వాహకులను కోర్టు ఆదేశించింది. ఇమ్రాన్‌, అతని న్యాయవాదులు కూడా పెన్సిల్స్, పేపర్‌లను అడియాలా జైలుకు తీసుకురావడానికి అనుమతించాలని కోర్టు ఆదేశించింది. దీంతో పాటు ఇమ్రాన్‌ను కలిసేందుకు ఆయన రాజకీయ సలహాదారులను కూడా హైకోర్టు అనుమతించింది.

Read Also: Russia-Ukraine War: రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయులు విడుదల!

అంతకుముందు, అడియాలా జైలులో పీటీఐ నాయకుడు ఒమర్ అయూబ్ ఖాన్, ఇమ్రాన్ మధ్య సమావేశం షెడ్యూల్ చేయబడింది. అయితే అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్‌ను కలవకుండా జైలు అధికారులు అడ్డుకున్నారని ఒమర్ అయూబ్ పేర్కొన్నాడు. తోషఖానా, సైఫర్, అక్రమ వివాహాల కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు ఇచ్చిన సమన్లను అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ రద్దు చేశారు. ఈ సమావేశంలో జాతీయ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేయనున్నారు.