
తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ, విద్యుత్ కార్మికులతో పోటీ పడి సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. గత పాలకులు సృష్టించిన సమస్యలను పరిష్కరించుకుంటున్నామని, ఖనిజ నిక్షేపాలు కేంద్రం అమ్ముకుంటుంటే గత ప్రభుత్వం నిలువరించ లేకపోయిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 72 వేల కోట్ల అప్పులతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభమై 7 లక్షల కోట్లకు చేరిందని, రాష్ట్ర ప్రభుత్వం 70 వేల కోట్లు అప్పు సంవత్సరానికి కట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. దివాలా పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన సమయంలో సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చెల్లించే పరిస్థితి ఉండేనని, రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉందన్నారు. ఒకటో తేదీ నుంచి 25 తేదీ వరకు ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి అని ఆయన అన్నారు. డిసెంబర్ నుంచి అక్టోబర్ వరకు రైతు బంధు చెల్లించే అవకాశం ఉందని అసెంబ్లీలో చెప్పామన్నారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తున్నామని, అందర్ని సంతృప్తిపరిచేలా నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. తండ్రి కొడుకులు, మామా అల్లుళ్ళ మాటలు ఆ పార్టీ నేతలే ఆమోదించడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట బాధ్యతగా చేస్తున్నామని, పది సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఒక్కో శాఖలో ఉన్న ఖాళీలు, కోర్టు కేసులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని, అరవై రోజుల్లో 25 వేల ఉద్యోగాలు ఇచ్చినమన్నారు రేవంత్ రెడ్డి. నిర్లక్ష్యంగా వదిలేస్తే మేము వచ్చి బాగు చేస్తున్నామన్నారు.
అంతేకాకుండా..’మార్చి మొదటి రోజు ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. హరీష్ రావు మెదడు ఉండి మాట్లాడుతున్నాడా? మెడిగడ్డ నీళ్లు అన్నారంలో పోశాము.. అక్కడి నుంచి సముద్రంలో పొశం. కాకి లెక్కలు రాసి లక్షల కోట్ల రూపాయలు తిన్నారు. నీళ్ల పేరుతో నిధుల దోపిడీ జరిగింది. తప్పుడు మాట్లలు మాట్లాడుతూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఊర్లు తిరుగు టున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల హామీలపై కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. మీరు సిద్ధమా? బీఆర్ఎస్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ బీజేపీ కిషన్ రెడ్డి చదువుతున్నారు. బీజేపీ – బీఆర్ఎస్ కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. కిషన్ రెడ్డితో నేను మాట్లాడే ప్రయత్నం చేసా. ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిశారా కిషన్ రెడ్డి? రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించే ఆలోచన కిషన్ రెడ్డికి లేదు. మూడోసారి మళ్ళీ ప్రధానిగా మోడీ అంటున్నారు ఎందుకు? మళ్ళీ రైతుల్ని కాల్చి చంపడానికా? బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజల్న్సీ మోసం చేసిన వారే. రేపు గృహ లక్ష్మీ పథకాన్ని ప్రారంభిస్తున్నాం.. రమ్మని అందర్ని ఆహ్వానిస్తున్నాం. ఎందుకు ముఖం చాటేస్తున్నారు? తెలంగాణను అభివృద్ధి వైపు నడిపేది కాంగ్రెస్ పార్టీ. పదేళ్లలో వందేళ్ళకు సరిపోయే విద్వాంసం చేసాడు కేసీఆర్’ అని రేవంత్ రెడ్డి అన్నారు.