Leading News Portal in Telugu

 హైదరాబాద్ లో పట్టుబడిన  భారీ డ్రగ్స్ ముఠా 


posted on Feb 26, 2024 1:57PM

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పట్టుకున్నారు. ఒక రాజకీయ నేత కుమారుడితోపాటు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు గచ్చిబౌలి పోలీసుల అదుపులో ఉన్నారు. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి. రాడిసన్ హోటల్ లోని పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో ఆదివారం రాత్రి ఓ బీజేపీ నేత కుమారుడు కొందరికి విందు ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించిన పోలీసులు దాడి చేసి.. హోటల్ లో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. సదరు బీజేపీ నేత కుమారుడు సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసులో పట్టుబడిన వారిలో మాజీ సీఎం రోశయ్య మనవడు సైతం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.హోటల్ లో అర్ధరాత్రి విందు ఏర్పాటు చేశారు. మత్తు పదార్థాలు కొకైన్ స్వీకరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ నేత కుమారుడితో పాటు మరో పాటు స్నేహితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మత్తు పదార్థాలు  కొకైన్ స్వీకరించినట్టు అనుమానం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.