Leading News Portal in Telugu

Bhatti Vikramarka : సంక్షేమ రాజ్యానికి సాక్ష్యం ఇది



Bhatti

సింగరేణి సంస్థల్లో పని చేసే 43 వేల మందికి ప్రమాద వశాత్తు ఏదైనా జరిగితే కోటి రూపాయల భీమా వర్తించే పథకమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సంక్షేమ రాజ్యానికి సాక్ష్యం ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. ఆరు గ్యారెంటీలతో పాటు సింగరేణి కార్మికులకు ఇన్సూరెన్స్ ఇస్తున్నామన్నారు. కార్మికులను కాపాడుకోవడం మా భాద్యత అని ఆయన అన్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల కు కూడా 20 నుంచి 30 లక్షల ఇన్సూరెన్స్ చేయించామన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం లేదు. మొట్టమొదటి సారిగా అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించామన్నారు. ఇదో అద్భుతమైన కార్యక్రమని, కోటి రూపాయల ఇన్సూరెన్స్ కల్పించే పథకానికి బ్యాంకర్లతో ఎంవోయూ చేసుకున్న సింగరేణి సంస్థమన్నారు.

సింగరేణి ప్రమాద బీమా హై లైట్స్​

  • యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తరఫున సింగరేణి ఉద్యోగులకు అందే బీమా ప్రయోజనాలు
  • ఉద్యోగుల జీతంతో సంబంధం లేకుండా కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా సదుపాయం (ప్రమాదంలో మరణం లేదా శాశ్వత పాక్షిక వైకల్యం, పూర్తి శాశ్వత వైకల్యం సంభవించిన పక్షంలో).
  •  యూనియన్‌ బ్యాంక్‌ డెబిట్‌ కార్డును నెలలో ఒక్కసారైనా వాడటం ద్వారా అదనంగా 15 లక్షల రూపాయల బీమా ప్రయోజనం.
  •  ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేకుండా రూ. 1 కోటి 15 లక్షల ప్రమాద బీమా సదుపాయం సింగరేణి ఉద్యోగులకు అందుతుంది.
  •  అగ్ని ప్రమాదం జరిగి ప్లాస్టిక్‌ సర్జరీ లాంటి ట్రీట్‌మెంట్‌ అవసరమైన పక్షంలో రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం.
  •  ప్రమాదంలో మరణించిన ఉద్యోగి మృతదేహాన్ని తరలించేందుకు రూ. 20 వేల ఆర్థిక సహాయం
  •  ప్రమాదంలో ఉద్యోగి చనిపోయే సమయానికి గ్రాడ్యుయేషన్‌ చదివే పిల్లలు ఉన్నట్లయితే రూ.6 లక్షల ఆర్థిక సాయం.
  •  ఎయిర్‌ అంబులెన్స్‌ అవసరమైన పక్షంలో 6 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం.
  •  ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఇద్దరు కుటుంబ సభ్యులు వెళ్లడానికి వీలుగా రవాణా ఖర్చుకింద రూ.20 వేల ఆర్థిక సాయం.
  •  అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటే ఏడాదిలో రూ. 15 వేల వరకు ఇన్‌ పేషెంట్‌ కవరేజ్‌ సదుపాయం.
  •  యూనియన్‌ బ్యాంక్‌ ఏటీఎంను అపరిమితంగా వినియోగించుకోవచ్చు. దీనిపై ఎలాంటి రుసుం ఛార్జ్‌ చేయడం జరగదు.
  •  ఎస్‌ఎంఎస్‌, ఆర్టీజీఎస్‌, ఐఎంపీఎస్‌ ఛార్జీలు కూడా ఉండవు
  •  లాకర్‌ సదుపాయాన్ని ఉపయోగించుకుంటే మొదటి ఏడాది రెంట్‌ మీద 50 శాతం రాయితీ
  •  రూ.25 లక్షల పైన గృహ రుణంపై ప్రాసెసింగ్‌ ఫీజు మినహాయింపు
  •  గృహ రుణం వడ్డీ పై 0.05 శాతం ప్రత్యేక కన్సెషన్‌
  •  వాహన రుణాల వడ్డీ పై 010 శాతం ప్రత్యేక రాయితీ
  •  విదేశీ విద్యాకోసం తీసుకునే రూ. 75 లక్షలకు పైగా రుణాలపై 0:10 శాతం రాయితీ.
  •  కుటుంబ సభ్యులు ముగ్గురు (జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు) జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు తెరిచేందుకు అవకాశం
  •  యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాలరీ ప్యాకేజీ కలిగిన సింగరేణి ఉద్యోగులందరికీ ఈ బీమా వర్తిస్తుంది. ఉద్యోగి రిటైర్‌ అయిన తర్వాత పింఛన్‌ ఖాతాను యూనియన్‌ బ్యాంకులోనే కొనసాగించడం ద్వారా 70 ఏళ్ల వరకు ఈ బీమా సదుపాయం అందుతుంది.